"చారిత్రాత్మకమైన ఏడు సంవత్సరముల యుద్ధము. ముప్పది సంవత్సరముల యుద్ధము. నూరు సంవత్సరముల యుద్ధమును గురించి మనము వినియున్నాము. అంతేకాకుండా మనిషికీ మనస్సుకూ మధ్యనూ, జీవికి మాయకు మధ్యనూ, వ్యక్తికి సామాజిక జీవితము మధ్యనూ యుద్ధము అనాదిగా నిరంతరమూ జరుగుచునే యున్నది. ఆదిమానవుడు మొదలు ఆఖరి మానవుని వరకూ ఈ సంఘర్షణ తప్పదు. అర్జునునివలె భగవంతునే జీవిత రథసారధిగా భావించి, ఇంద్రియములు, కోరికలు, మనస్సు, బుద్దివాటి ఆద్యంతములు భగవంతునికి అర్పణము చేసిన కాని జీవిత సంగ్రామములో విజయము సాధించుట సాధ్యము కాదు. ఆత్మ విద్య బోధించు పాఠమే యిది. ఈ పాఠమును నేర్చుకొను హక్కు ఈ యువతరమునకున్నది."
(స.. శి.సు తృభా. పు.10)