తితీక్ష యనగా ద్వంద్వములలో సహనము. సహనము బలవంతులకే తగినది. అది వారి సొత్తే వారి పోత్తే. దుర్భలుడు ద్వంద్వాల తాకిడికి నిమిషము స్థిరములేక, నెమలి పింఛమువలే కదలుచునే యుండును. గడియారము పెండ్యులమువలే అటూ ఇటు కదలుచునే యుండును; అనగా, ఒకతూరి సుఖమువైపున మరొకతూరి దు:ఖమువైపునా చూచుచుండును.
(గీ.పు.29)
(చూ॥ ఆథాతో బ్రహ్మజిజ్ఞాస, అలవర్చుకోవాలి)