సత్యధర్మ ప్రేమ శాంతులతో మీ నిత్య జీవన యాత్ర సాగించు –
కర్మయోగమే జన్మధర్మము ! సాధనే భక్తుల సాధులక్షణంబు –
సత్యమనే విద్యుత్తు ధర్మమనే తీగ ద్వారా, శాంతి
అనే బల్బులో ప్రవేశించి, ప్రేమ అనే కాంతిని ప్రసరిస్తుంది.
(సా॥ పు. 78)
మానవునికి హృదయమే - నిజభోధకుడు:
కాలమే - నిజగురువు.
ప్రపంచమే - పెద్ద గ్రంధం.
భగవంతుడే - గొప్ప మిత్రుడు.
ఈ నాల్గింటిని విశ్వసించి ఈ జగత్తు అనే కర్మక్షేత్రంలో మానవుడు తన జీవనయాత్ర సాగించాలి. ప్రేమ తత్వమే ఏకత్వాన్ని - అనుభవించడానికి నిజమైన రాజమార్గము.
(దే.యు. పు. 6)