జీవన్ముక్తునికి రాజస తామసములు నశించి సత్వము మాత్రము మిగిలియుండును. అట్టి శుద్ధసత్వగుణముచేల అతడు మైత్రీకరణ కలవాడై యుండును. విదేహ ముక్తునియందు శుద్ధసత్వము సదా నశించును. శుద్ధసత్వము యొక్క ముఖ్య చిహ్నము ప్రకాశము, జ్ఞానము, ఆనందము, శాంతము, సమత్వము ఆత్మవి శ్వాసము, పవిత్రత, శుద్ధభావము మొదలైనవి, శుద్ధసత్వమందే ఆత్మ ప్రతి బింబమును చూడగలుగ వచ్చును. రాజసతామసములు శుద్ధసత్వములో కలిసినప్పుడు, అది అపవిత్ర సత్వమగును. అట్టి అపవిత్ర సత్వమువలననే అవిద్య, అజ్ఞానము కలుగుచున్నది. అదే జీవునికి ఉపాధి అగుచున్నది. కావున మార్పు కలుగును. రాజసము నిక్షేపశక్తిని కలిగియుండును. జగత్తు వృద్ధి చెందుచుండును. రాజసము ఎక్కువ అనురాగమును కలిగించి తద్వారా అనేక కర్మలు చేయించి, సుఖ దుఃఖములను కలిగించును. రాజనము జీవుని బంధించి క్రోధము, దురాశ, గర్వము, అసూయ దంభము. కపటము మొదలగు దుర్గుణములను బలపరుచుచున్నది.
(జావా, పు.16)