తలంబ్రాలు పోయటానికని ముత్యములను తెచ్చి తట్టలలో పెట్టుకున్నారు. భారతీయ సంస్కృతియందు ఇది ప్రధానమైన ఆచారము. సీత తలంబ్రాలు తీసుకొని దోసిలి పట్టినప్పుడు గోరింటాకు వలన తెల్లని ముత్యములన్నీ ఎఱ్ఱగా కనిపించాయి. వాటిని తీసి రాముని తలపై పోసింది. రాముని తలపాగా తెల్లగా ఉండటం చేత ఆ ముత్యములు కూడా తెల్లగా కనిపించాయి. రాముని వర్ణము నిలవర్ణము. కనుక, అవి క్రింద పడేటప్పటికి నీలంగా మారిపోయినవి. చేతిలో తీసుకున్నప్పుడు ఎఱ్ఱగా, తలపై పోసినప్పుడు తెల్లగా,
క్రింద పడినప్పుడు నీలంగా మారుతూ వచ్చాయి ముత్యములు. ఈ కళ్యాణము జగత్కల్యాణముగా రూపొందింది. మంగళకరంగా జరిగింది.
(శ్రీ.భ.ఉ.పు.56/57)