"శ్రీ కృష్ణుడు కేవలం తనని గురించి మాత్రమే చింతించమని మరేదీ చెయ్యవద్దని కాదు చెప్పింది. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఇతరమైన (అనన్యమైన) దానిని గురించిన ఆలోచన విడిచి పెట్టండి. అన్యమైనది అంటూ వేరే ఏదీ లేదు. అన్ని ఒక్కటే. అంతా ఒక్కటే అన్యము అనేదానిని వదిలేస్తే ప్రేమమూర్తి అయిన భగవంతుడు నిన్ను తనవాడిగా ప్రేమిస్తాడు "
(శ్రీ. . స. ప్రే సు. స్ర. పు. 248)