ముక్తి మానవుని జన్మహక్కు మరచిపోయిన ఈ హక్కును గురువు జ్ఞాపకం చేస్తాడు. ఒకాయన రోజు గీతాపారాయణం చేస్తాడు. ఎప్పుడో అందులో ఒక పది రూపాయల నోటు పెట్టి ఆ సంగతే మరచి పోయాడు. ఒకనాడు అతనికి డబ్బు అవసరం వచ్చి ఒక స్నేహితుడి వద్ద పదిరూపాయలు బదులడగటానికి వెళ్ళాడు. అప్పుడు కూడా అతని చేతిలో గీతా పుస్తకం ఉంది. ఆ స్నేహితుడు పది రూపాయలు బదులిచ్చి ఆ పుస్తకం ఏమిటో చూసిస్తానని తీసుకున్నాడు. పేజీలు తిరగవేస్తుంటే ఆందులో పది రూపాయల నోటు కనబడింది. నీ దగ్గరపది రూపాయలుంచుకొని బదులుకి వచ్చావేమిటి? అన్నాడు. అందులో నోటు పెట్టిన సంగతి మరచిపోయానని అతనన్నాడు. అట్లా మరచిన నోటులాంటిది ముక్తి, ఆ మరపును తొలగించుటయే గురువు కర్తవ్యం.
(స.పా.జూలై 2000 వెనక కవరు)