జన్మమృత్యు జరావ్యాధి దుఃఖదోషాను దర్శనము అన్నింటి కంటెను ప్రధానమయినది. జన్మ దు:ఖము, మరణ దుఃఖము, వ్యాధి దుఃఖము చూచుచుండియూ వాటి సత్యమును తెలిసికొన పోకుండుట మహా ఆశ్చర్యము. దీని పుట్టుపూర్వోత్తరాలు విచారించిన యేది తప్పిననూ మృత్యువు తప్పదని తేలుచున్నది. మానవులు దేనిని సుఖమని తలంచుచున్నారో అవి సుఖ వేషముతో కనబడు దుఃఖాలే. నిజమును తెలిసికొనిన విషయ దోషములను మననము చేసినప్పుడు వైరాగ్యము చేకూరి జ్ఞానము సిద్దించును.
(గీ.పు.209/210)