జగత్సేవకుడైన సూర్యనారాయణుడు సదా మీ వాకిట ముందు నిలిచి యేయుండును. మూసియున్నతలుపులను బ్రద్దలు కొట్టి సూర్యుడు లోపల ప్రవేశించడు, వీలయన అతడు సేవకుడు. అతడు స్వామి హద్దులను, తన హద్దులనూ గుర్తెరిగి మెలగును. తలుపు తట్టనైనా తట్టడు. యజమానుడు తలుపులు కొంచెము తెరవగానే సూర్యుడు పూర్ణతేజముతో లోపలికి జొరబడి, అంధకారమును పారద్రోలును. పురమాత్ముని స్థితి కూడా ఇట్టిదే. తన సాయము సమర్థించినంతనే చాచిన చేతులతో జీవులచెంతనే కనుపించును.
సత్యాసత్య వివేకములో ప్రవర్తింపనంతవరకూ దేహాత్మల పృదః కరణ శక్యముకాదు.ఈ వివేకము ఈ జ్ఞానమూ మానవ రోమ రోమమునకూ వ్యాపించవలెను.
(ప్రే.వా. పు.30)