"గ్రామాలలో సేవ చేయడం నేర్చుకోవాలి, పట్టణాలలో ఏమున్నది? అక్కడ ఈర్ష్యాద్వేషాలు, బాగుపడితే ఓర్వలేరు. చెడిపోతే చేయి అందించరు. అది అక్కడ పరిస్థితి. కనుక గ్రామసీమల ప్రజలను పైకి తీసుకొని రావాలి. గ్రామసేవే రామసేవ గదా!
(ప్రే.జ్యో, పు.36)
గ్రామ సేవయన్న రామసేవయే సుమా!
రామరాజ్యమన ప్రేమ మయమే
ప్రేమలేక ఉద్దరించుటయే లేదు,
సేవలేని నరుడు బాగుపడడు.
నరుడు బాగుపడవలెనన్న సేవలోనే ప్రవేశించాలి.
కరుణ ప్రేమయె లేకున్న నరుడే కాదు
స్నేహతత్వంబె వారికి చేయుమేలు.
(స. సా.డి. పు. 308)