స్వార్థము, రాగము, ద్వేషము, మమకారము, అహంకారము యివి నిర్మూలనము గావించే నిమిత్తమై యీ గీత యిన్ని శిరస్సులు ధరించి అనేకరూపములుగా అనేకమందిని ఆదరిస్తూ వచ్చింది. ఈ గీత కల్పవృక్షము వంటిది. ఎవరు యే విధమైన అర్థమును తీసుకుంటే ఆ అర్థముగా అన్వయిస్తుంది. దీనికి యిదే అర్ధము, అదే అర్థము, అని నిర్ణయించే అధికారము యెవరికి లేదు. కల్పవృక్షములో యీ పంటనే పండాలి. యీ ఫలమే రావాలి యని యెవరు నిర్ణయించగలరు? కోరినదాన్నంతా అందిస్తుంది. కనుకనే
గీతయే భగవానుని దూత, గీతయే జగదేక మాత
గీతయే సాధకుని ఊత, గీతయే సంసారికి ఈత
గీతయే మంత్రాల మూట, గీతయే వేదాంతపు ఊట
గీతయే మంచి పూలబాట, గీతయే ఘనరాజ బాట
ఇదియే శ్రీసాయి మాట
ఇష్టము లేనివాడు గీతను గీతగా కూడ గీయవచ్చు.
(శ్రీ.స. గీ. పు. 291)