మన అందరి గమ్యస్థానము దైవత్వము. అది ఎట్లా చేరేది? తేలిక మార్గము చూచుకోవాలి. గమ్యస్థానం చేరటానికి షడ్ దర్శనాలు అనే 6 శాస్త్రాలువున్నాయి. అవి ముళ్ళబాట వంటివి. కఠినమైన రాళ్ళలో పడి కష్టములకు గురికావడం. ఇది కత్తిపై సాము వంటిది. నిప్పులో చెలగాటము వంటిది. ఏ పవిత్రులైన మహర్షులో వీటిని సాధించగలరు గాని. సామాన్య మానవులు దీనిని సాధించలేరు. రాచబాట - దగ్గర త్రోవ "ప్రేమతత్త్వము" ఆ ప్రేమతత్త్యాన్నే అర్థము చేసుకొని ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించండి.ప్రేమచేతఎంతైనాసాధించవచ్చు.షడ్దర్శనముల ప్రభావము గొప్పదే.అనుభవించినప్పుడేఆనందం.అన్నిటికి ఆధారమైన ఆత్మ "నేను" అనే లక్ష్యమునందే సర్వరూపములు ఇమిడి యున్నవి. ఒకటి ఒక అంకె. దాని ప్రక్కను సున్నాలు పెట్టితే కొద్ది విలువలు కోటాను కోట్లకు పెరుగుతుంది. ఆ ఒక్కటీ తీసివేస్తే అంతా సున్నా అవుతుంది.
(సా.పు. 31/32)
(చూ॥ అభిన్నత్వం. ఆహంకారము, గజానన, గౌణశ్చేన్నాతశబ్దత్, భక్తి పరమావధి. మహావాక్యములు, స్వధర్మాచరణ)