ఎట్టి కర్మము తన యందు పట్టుకొనక|
దైవమందున నిప్పి| తాధర్మపథము
తప్పకుండగ చేసిన - ఎప్పుడైన
ప్రాణికంటదు | సుఖదు:ఖ ఫలమనేది |
(సా. పు. 186)
పరులు దూషింప నీవునూ వారివలెనే
తిరిగి దూషింప నీదు అధిక్యతేమి?
ఏది తప్పని నీవు ఎరిగినావో
దాని చేయక యుండుటే ధర్మపథము.
(స.పా.డి.85పు.317)
ఒరులేయవి యొనరించిన
నరవర! నప్రియము తన మనంబునకగు దా
నొరులకవి సేయకునికియె
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్
(స.సా. 2022 సె 2022 పు 15 )