మీ ఆస్తులకూ, సంపదలకూ యాజమాన్యం ఈశ్వరునిది. ఆయన పక్షాన వ్యవహరించే ధర్మకర్తలు మీరు. అదే విధంగా కుటుంబమునకు కూడా ధర్మకర్తలుగా వ్యవహరించి మీయింటిలోని వారిని ప్రేమతో సాకుతూ మార్గదర్శకులు కావలెను. ఆ విధంగా సంసారబాధ్యతలు కూడా పవిత్రంగా చేసుకుంటూ కుటుంబ నిర్వహణమును ఆధ్యాత్మిక పురోగతి సాధనంగా మార్చుకోవాలి.
(వ.1963 పు.230)