నేను హాస్టల్‌కు వచ్చినప్పుడు సాయిగీత" (ఏనుగు) అరచుకుంటూ వచ్చింది. కంటిధారకారుస్తూ, అరుస్తూ వచ్చింది. నాకారు వెనక ఎనభైకార్లు వచ్చాయి. నా కారు శబ్దమునిని అరచుకుంటూ నా దగ్గరకే వచ్చింది. ఎంత తెలివి! ఎంతటి మేధాశక్తి! మంచి తెలివితేటలు గల మానవుణ్ణి చూచి వీడిని ఏనుగు తెలివి తేటలురా! అంటారు. గజ తెలివి అంటారు. ఏనుగు చాల తెలివితేటలు కలిగినటువంటిది. విఘ్నేశ్వరునకు గజ శిరస్సు పెట్టటానికి కారణమేమిటంటే, తెలివైనటువంటి వాడని ప్రజలకు చాటి చెప్పేందుకే! ఆందుకు ఏనుగుతలను ఒక చిహ్నంగా పెట్టారు.
(శ్రీసా.గీపు. 24)