"అయ్యా! మీ యిద్దరిని సుగ్రీవుని దగ్గరకు తీసుకొని పోదును. నా భుజములపైన ఎక్కి కూర్చోండి" అని, ఎక్కుటకు వీలుగా శరీరమును కుంచించినాడు. రామలక్ష్మణులు, సుందర మందహాసకటాక్షములతో హనుమంతుని ఒకమారు వీక్షించి, అతని భుజముల పైకి ఎక్కి కూర్చున్నారు. అతని జన్మము ధన్యమైనది.
“ధర్శనం పాపనాశనం;
సంభాషణం సంకట నాశనం;
స్పర్శనం కర్మవిమోచనం" కదా!
రామలక్ష్మణుల యొక్క సంభాషణంచేత, హనుమంతుని సంకటం కొంత వరకు శాంతించింది. భగవంతుడైన శ్రీరాముని దేహము సోకిన తక్షణమే, అతని హృదయమున, అనేక విధములైన సద్భావములు,సదాలోచనలు, సచ్చింతనలు ఉద్భవించిఉప్పొంగుతూవచ్చాయి.
(ఆ.రా. పు. 201/202)