దీపం ఉన్నప్పుడే మనం మన పనులను చక్క పెట్టుకోవాలి. పడవ చిల్లులు పడి శిధిలం కాక పూర్వమే నదిని దాటాలి. అన్ని విధాలా పటుత్వంగానున్న సమయంలోనే చేయవలసిన సత్కార్యాలు చేయాలి. దైవకార్యాలను ఆచరించాలి. సాధనలు సలిపి దైవానుగ్రహమునకు పాత్రులం కావాలి. వర్షాకాలంలో Tank ను పూర్తిగా నింపితే ఎండాకాలంలో కూడా చక్కటి పంటలు పండించుకోవచ్చును. అయితే కొంత మంది ఆబ్బే!ఇప్పటినుంచే భగవచ్చింతన ఎందుకు? Retire అయిన తరువాత ప్రశాంతంగా జపం చేసుకుంటూ కూర్చోవచ్చు. వంటారు. కాని Retire అయిన తరువాత మన అంగములు Tire అయిపోతాయి. అప్పుడు మనం ఏమి చేయగలుగుతాం?" జవసత్వాలు ఉడిగిన తరువాత చేయగలిగినదేమి లేదు. ఓపిక ఉన్నప్పుడే ఏ పనినైనా చేయగలుగుతాం, దేనినైనా సాధించగలుగుతాం. వయసు మళ్ళిన వారికి ఏకాగ్రత కుదరదు. కనుక వంటిలో శక్తి ఉన్నప్పుడే దైవచింతనకు కొంత సమయాన్ని కేటాయించాలి. అలా చేయకుండా అవసాన దశలో చింతించితే ప్రయోజనం ఉండదు. "దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి" అనే లోకోక్తిని విస్మరించరాదు.
(ఆ.కు.చివరిపుట)