"అద్వేష్టా సర్వభూతానాం" అని శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు బోధించినాడు. కావున ప్రతివానిని తోటియాత్రికునిగా ప్రేమించుట నీ కర్తవ్యము. ఒకే మత మున్నది. ప్రేమమతము: ఒకే కులమన్నది మానవకులము; ఒకే భాష ఉన్నది, హృదయభాష, ఒకే పరమాత్మ, ఆతడు సర్వవ్యాపకుడు. ఈ ఏకత్వములోని సత్యమును సూచించు చిహ్నము ధర్మక్షేత్రములోని స్థూపము,
(స. సా.జ. 75 పు. 108)