ఈనాటి మానవుడు అనేక చింతలతో జీవిస్తున్నాడు. అయితే, ఇవన్నీ తనకు తానుకల్పించుకున్నవే
పుట్టుట ఒక చింత
భూమినుండుట చింత
సంసార మొక చింత, చావు చింత
బాల్యమంతయు చింత, వార్థక్య మొక చింత
జీవించు టొక చింత, చెడుపు చింత
కర్మలన్నియు చింత, కష్టంబు లొక చింత
సంతస మొక చింత, వింత చింత
ఈ పన్నెండు చింతలచింత చెట్టు క్రింద కూర్చొని, సంతోషం కావాలంటే ఎట్లా లభిస్తుంది. మీకు?ఈ చింతలన్నీ మీరు కల్పించుకున్నవేగాని, భగవంతుడిచ్చినవి కావు. ఇవన్నీ మీ భ్రమయే సృష్టి స్తున్నది. భ్రమను దూరం చేసుకున్నప్పుడే బ్రహ్మ చిక్కుతాడు. ఎక్కడో కాదు, మీయందే సాక్షాత్కరిస్తాడు. నిప్పును అలక్ష్యం చేస్తే దానిని నివురు కప్పివేస్తుంది. నివురును తొలగిస్తే నిప్పు కనిపిస్తుంది. అట్లే, మీలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించుకోవాలంటే, దేహాభిమానమనే నివురును దూరం చేసుకోవాలి. శంకరులవారు చెప్పారు. “భజ గోవిందం" అని. అదే మీరు చేయవలసినది. (స.సా. మా 99, పు. 78)
నీ దృష్టి ప్రేమ మయము కానప్పుడు ఈ ప్రపంచమంతయు చింతలమయంగా మారిపోతుంది. ప్రపంచములో ఎన్నిరకములైన చింతలుంటున్నాయి?
"పుట్టుట ఒక చింత, భూమినుండుటచింత,
సంసారమొకచింత, వార్ధక్యమొచింత,
జీవించుటొకచింత, చెలిమిచింత,
కర్మలన్నియు చింత, కష్టంబులొక చింత,
సంతసమొకచింత, వింతచింత”
కనుకసర్వచింతలను తొలగించెడి పర్వేశ్వరుని పై మీరు భక్తి ని పెంచుకొని అతని యొక్క ప్రేమను ఇకనైనా అందుకోండి. (స.సా. మే 1992 పు. 95)
ఇన్ని చింతలతో కూడిన మానవునికి చింతలు లేకుండా పోవాలంటే ఎలా సాధ్యమౌతుంది. ఈ చింతలన్నీ మనస్సు నుండి ఆవిర్భవించినవే. అటువంటి మనస్సునుమీరుబానిసగా చేసుకోగల్గితే ఇక ఈ చింతలకు అవకాశమే ఉండదు. మనస్సే స్వాధీనమైతే ఇతరమైన మంత్రాలు, తంత్రాలు మనకు అక్కరలేర్లేదని త్యాగరాజు కూడా చెప్పాడు.
"సర్వచింతలు బాపెడి సాయి ప్రేమ
గానుడు ఇకనైన ప్రజలార ప్రేమతోడ"
సర్వచింతలూ దీనివల్లనే పరిహారమౌతాయి.కనుక, మీరు సాయి ప్రేమను పొందడానికి కృషి చేయండి. దైవ ప్రేమచేత మీరు దేనినైనా సాధించవచ్చు. (ది. ఉ. 23-11-2001 పు.7)
దోషచింతనమున దోషియౌచిత్తము
సద్గుణములచింత శాంతి యొసగు
దైవ చింత నమున దైవమేయగున యా
ఉన్న మాట తెలుపుచున్న మాట
(శ్రీ స.గీ. పు. 9)
చింతలేని వానికి సంతలో కూడా నిద్ర వస్తుంది. (స.సా. జ 2013 పు 4 )
“జననమరణమధ్యమందు. జగన్నాటక రంగమందు! కామక్రోధగానములు, లోభమోహ గీతములు, మదమాచ్చర్య వేషములు, వ్యామోహముల ప్రదర్శనలు! నవరకముల ప్రదర్శనలు, తుదకు శాంతిపాఠములు" “పుట్టుట ఒక చింత, భూమినుండుటచింత! సంసారముచింతం చావుచింత, బాల్యముచింత, యవ్వనముచింత! వార్ధక్యముచింత, జీవితముచింత! కర్మలన్నియుచింత! సంతోషముచింత, సర్వచింతలు: బా పెడి సర్వేశభక్తి గొనుడి యికపైన భక్తులారా! (శ్రీ భగవా న్ ప్రబోధ15-6-73 – పు 125 )