"చదువులన్ని చదివి చాల వివేకియై
మగిడి తన్నెరుగడు మందమతుడు
ఎంత చదువుచదివి ఏ నీతి యున్నను
హీనుడవగుణంబు మానలేడు"
"తరచి చదువు చదవ తర్కవాదమెగాని
పూర్ణ జ్ఞానంబెపుడు పొందలేడు
చదువు చదివి చదివి చావంగనేటికి
చావులేని చదువు చదువవలయు"
అదియే సత్యమైన చదువు. అదియే ధర్మమైన చదువు. ఆ ధర్మము ఆ సత్యమే సత్పురుషుల చెంత వుంటుంది. ఎవరు సత్యాన్వేషణ సలుపుతుంటారో, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో ఎవరియందు సద్గుణములు వికసిస్తూంటాయో వారి సన్నిధి యందే ఉంటుంటాది సత్యము. ఆత్మకు సత్య అని మరొక పేరు. ఈ ఆత్మనిత్యమైనది కనుకనే ఆత్మకు సత్య అని పేరు. సర్వులయందు ఉండునది. అది ఒక్కటే. ఇంక అన్ని కూడను మార్పు చెందునవే. వ్యక్తి గాని విషయముకాని పదార్థముకాని కదిలిపోయే మేఘములే. అట్లని లౌకికమైన చదువులు చదవద్దని కాదు. ఈ చదువులతోపాటు ఆ చదువులు కూడను చదవటానికి తగిన కృషి చేయాలి.
(బ్బత్ర. పు.౯ )
"కోహం, కోహం" (నేనెవరు?) అని పుట్టిన మానవునేడు "సోహం, సోహం" (నేనే దైవం) అని మరణించాలి. మానవుని ఉచ్చ్వాస నిశ్వాసములు దినమునకు 21,600 పర్యాయములు "సోహం, సోహం" అంటున్నాయి. సో’అనగా ... (అది) అంటే దైవము; హం అనగా నేను. కనుక, సోహం అనగా, "నేనేదైవం". ఈ సత్యాన్ని మీ అంతర్వాణి దినమునకు 21,600 పర్యాయములు మీకు బోధిస్తున్నదిగాని, దానిని మీరు శ్రవణం చేయడం లేదు. "కోహం?" అనే ప్రశ్నకు మీ అంతర్భావం నుంచి ఆవిర్భవించే జవాబును మీరు ఏ మాత్రం లక్ష్యం చేయడం లేదు. ప్రతి దినము వార్తాపత్రికలలో వివిధ దేశముల నుండి వచ్చే న్యూస్" ను చదువుతున్నారుగాని, మీ నుండియే వచ్చే "న్యూస్ ను మీరు గమనించడం లేదు. ప్రపంచంలోనున్న సమస్త పదార్ధములను గురించి, విషయములను గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారుగాని, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకొనక ఎన్ని తెలుసుకొని ఏమి ప్రయోజనం? మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారవుతారు. మానవ జీవితం చాల ఉన్నతమైనది. మానవునికున్న శక్తి, సామర్థ్యములు ఏ జీవికీ లేవు. భగవత్సృష్టిలో మానవ జీవితం చాల చిత్రమైనది. విచిత్రమైనది.
చిత్రంబులు త్రైలోక్య ప
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు ముని జన వన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.
ప్రతి మానవుని చరిత్ర విష్ణుదేవుని చరిత్రయే. మానవుని నుండి ఆ దైవం యొక్క చరిత్ర ఆవిర్భవించాలి. మానవుడు, దైవము వేరు కాదు. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. కానీ, మానవుడు దేహభ్రాంతిచేత తాను వేరు. దైవం వేరని భావిస్తున్నాడు. ఈ దేహాభిమానంచేతనే సర్వవిధములైన అజ్ఞానం ఆవిర్భవించుచున్నది. క్రమక్రమేణ దేహాభిమానమును తగ్గించుకుని ఆత్మాభిమానమును అభివృద్ధి పర్చుకోవాలి. ఎంతకాలం ఈ దేహం?
పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు
ఎప్పుడో విడిచేది ఎఱుక లేదు
శరవర్షముల దాక మితము చెప్పిరి కాని
నమ్మరాదా మాట నెమ్మనమ్మున
బాల్యమందో లేక ప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలియందో
ఊరనో ఆడవినో ఉదక మధ్యంబునో
ఎక్కడో విడిచేది ఎఱుక లేదు
మరణమే నిశ్చయమ్మది మానవునకు
బుద్ధిమంతుడై తన దేహమున్నయపుడే
తన్ను తా తెలియుట ధర్మతత్త్య మరయ.
మీ ప్రాణమున్నంతలో మీ సత్యమును మీరు తెలుసుకోవాలి. ఇదియే మీరు చదువవలసిన చదువు.
(స, సా, ఆ. 99, పు. 262/263)
"చదువు చదివి చదివి సద్గుణంబులు లేక
పరుల మోసగించి బ్రతుకువాడు
వాని కంటె మేలు వసుధలో గాడిద
బరువు మోసి తాను బ్రతుకుచుండు"
(శ్రీ. వా, 97, పు. 103)
హెచ్చు చదువు చదివి యింద్రియలోలురై
చచ్చువారికన్న స్వల్పమైరి,
ఇంద్రియముల శక్తియినుమడించును గాని
ఆట్టి చదువు చదివి ఆర్యుడౌనె?
చచ్చు చదువు చదివ సంతసమును లేక
ఆత్మచింతనొందువాడు చదువరుండు.
(శ్రీ ప.ది. 1993 పుట. 127)
చదువుల్ నేర్చితినంచు గర్వము వహించన్ రాదు
నీకున్న చదువేపాటిది? విద్యకున్ వినయమె సద్రూపమౌ
నేర్వ గల్గినదెంతేని కలదంచు, గర్వముల్, దురహంకారముల్
బాయుడీ, సుదతీ, ఓయీ, అవిద్యాపతీ
(భారతీయ స్రీ పు 251
“ఎంత చదువు చదివి ఏరీతి ఉన్నను
హీను డవగుణంబు మానలేడు"
కనుకనే మన క్షేత్రాన్ని మనం సరిదిద్దుకొనే స్థితిలో లేక పోతున్నాము.
"పంట పండని భూమి పది ఎకరములేల?
కొంచెమైన చాలు మంచి భూమి
శుద్ధమైన నిర్మలమైన నిత్యమైన నిస్వార్థమైన ప్రేమతత్త్వము కింది ఉండినా చాలు. ఈ ఆనందమును అందుకున్న కృతజ్ఞత ఏకించిత్తైనా మనయందున్న చాలు. ఆ కృతజ్ఞత కాని ఆ విధమైన ప్రేమకాని హృదయములు మరుభూము లే! కనుక మనము ఈనాడు చేసుకోవల ప్రయత్న మేమిటి? మనకుండిన విశాలమైన విలువైన ఈ భూమిని సాగు చేసు కోవటానికి తగినకృషి చేయాలి. సాగు చేసుకునే శక్తిసామర్యములు నీలో లేకపోలేదు. పిల్లలంతా ప్రతి స్పీచ్ లో చెప్పుతుంటారు. “స్వామీ దీనిని అను భవించే శక్తిని నాకందించండి. స్వామి యొక్క అజ్ఞను శిరసావహిoచి నడుచుకునే శక్తిసామర్థ్యములు నాకందించండి” అని. వారు నిజంగా యందు లేదనే అర్థం చేసుకుంటున్నారు. ఇది అందించేది కాదు. ఉన్న దానిని మనము సరియైన రీతిలో చూడలేక పోతున్నాము. కారణ మేమిటి? నడుచుకు నే శక్తిసామర్థ్యములు నాకందించండి” అని. వారు నిజంగా తమ యందు లేదనే అర్థం చేసుకుంటున్నారు. ఇది అందించేది కాదు. ఉన్నదే ఉన్న దానిని మనము సరియైన రీతిలో చూడ లేక పోతున్నాము. కారణ మేమిటి? నీ దృష్టి దాని పైన లేదు . నీదృష్టియే దాని పైన ఉండిన దానిని ఏరకంగా నైన సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నిస్తావు. మానవత్వము లోపల ఒక వ్యక్తిత్వాన్ని గాని ఒక వస్తువునుగాని చక్కగా గుర్తించినప్పుడే దీనికి సరియైన అర్థముంటుంటాది. దేనిని మనము ఆశిస్తున్నా మో మొట్టమొదట దానిని గురించి మనం చక్కగా విచారణ చెయ్యాలి. తదుపరి దానిని అనుభనించటానికి పూనుకోవాలి.
ఈనాడు మనము సరియైన విషయాన్ని గుర్తించుకోలేకుండా మన క్లానంటే ఏమిటి? మన సబ్జెక్ట్ అంటే ఏమిటి? మన చదువంటే ఏమిటి? మన డిసిప్లిన్ అంటే ఏమిటి? మన మానర్స్ అంటే ఏమిటి? అనే విషయాలను ఏమాత్రము విచారణ చేసుకోకుండా చదువు కావాలి, చదువు కావాలి ఏదో విధంగా డిగ్రీ తీసుకోవాలి, (ఓ) గ్రేడు రావాలి అంటున్నా మేకాని ఏ రీతిగా తెచ్చుకోగలం?
నేటి విద్యార్థులందున నూటి కొకరు
పాఠ్యగ్రంథమ్ము చదువంగ పాటు పడరు
పాసు కావలెనంచును పరితపింత్రు
బూటకంబుగ మారెను నేటి విద్య.
కేవలము కంఠస్థము చేసుకొని ఎక్జామినేషన్ రాసినంత మాత్రమున విద్యార్థుల అంత విద్యావంతుల మౌతామా? ఈ విద్యవల్ల జగత్తునకు ఏమి ఉపకారం ఆగుతుంది. నీకు ఉపయోగం లేదు. జగత్తుకు ఉపయోగం లేదు. నీవు చదివిన విద్యలన్ని ఒక్క సంవత్సరంలోనే మరచిపోతున్నావు. చదివిన విద్యలకు చే సే ఉద్యోగమునకు ఏమాత్రం సంబంధం లేదు. జీవితమునకు ఆధారమైన విద్యలు జనరల్ నాలెడ్డి, కామన్ సెన్స్. ఈ విద్యలంతా పాఠ్య గ్రంథములలో ఉండవు. నిత్యజీవితమునకు అవసరమైన సత్య మార్గ మును బోధించే నిమిత్తమై ఈ విధమైన బోధలు మీకు సలుపవలసి వచ్చింది. మీ ఉద్యో గాల నిమిత్తమై ఈ చదువులు చదువుకోండి. ఐతే, నిత్యజీవిముకోసము ఈ చదువులు కూడను అత్యవసరమని గుర్తించండి. మీరు చక్కగా యోచన చేసుకోవచ్చు.
(శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 48-49)
ప్రాణికోటికి ప్రీతి యెవ్వానియందు?
సత్య మణకువ మధుర భాషాభి యుతుని
అంధుడగువాడు ఎవ్వడీ యవనియండు?
చదువు గల్గియు చెడు క్రియల్ సలుపువాడు!
(శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 110)