కుటిలచిత్తుడు రాజ్యమునేలిన భూమి పాతాళమునకు క్రుంగును. స్వార్థపరులు, సంకుచితచిత్తులు, దురాశా పరులు, ఆడంబరజీవులు, అహంకార వ్యక్తులు, అసూయాస్వభావులు రాజ్యాధికారులు కారు. అట్టి వారల పరిపాలన ప్రజలకు హాని కలిగించును, ధర్మమున నాశనము చేయును. దేశమునకే కీడు వాటిల్లును. సదాచార, సచ్చీల, త్యాగ, సత్యవాక్య పరిపాలకులే రాజ్యాధికారులు.
(రా.వా.మొ.పు.315)
(చూ|| సనాతన ధర్మము)