తానెవరో తెలుసుకొనక బయట ప్రపంచమును తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకొనటానికి తగిన ప్రయత్నం చేయాలి. తన దేహమును తన మనస్సును తన యింద్రియములను ఆత్వతత్వమును మొట్ట మొదట గుర్తించటానికి తగిన కృషి చేయాలి.
“జగమున జీవించు వాడు మనుజుడు కావలె మొదట
దనుజుల దుష్కృతులనెల్ల పొగడువాడు చవట
బ్రహ్మవిద్య నేర్చి యిచట ఆత్మజ్ఞానము కనుగొనుట
ఇదియే మానవ జీవితమునకు రాజబాట"
(బృత్ర.పు.