రామచంద్రుడు ప్రతి మాటయందును, పనులయందును తన కారుణ్యమును కనుపరిచెడివాడు. ఒకొకపరి లక్ష్మణుడు కొంత ఉల్లాసముతో, సరదాగా మృగముల పై గురి పెట్టిననూ తత్క్షణము రాముడు అడ్డుతగిలి "లక్ష్మణా! వాటివలన నీకుకాని, లేక లోకమునకు కాని గలిగిన ఆపకారమేమని వాటిని కొట్టపూనుకొంటివి? నిర్దోషుల శిక్షించుట రాజనీతికి పరమవిరుద్ధముకాదా అని నీతులు చెప్పెడివా డు.
(రా.వా.మొ.పు. 45/46)