జరిగిన యుద్ధములు మానవునకేమి నీతిని బోధించినవి? కామ, క్రోధ, ద్వేష ఆసూయలు అనునట్టి దుష్ట శక్తులు మానవుని బాధించునను నీతిని యుద్ధములు బోధించుచున్నవి. ఈ దుష్ట శక్తులే అరాజకమునకును, చట్ట విరుద్ధ ప్రవర్తనమునకును, విప్లవములకును, హత్యలకును ప్రస్తుత ప్రపంచములో కూడా కారణములై విజృంభించుచున్నవి.
(జ.పు.165)
(చూ॥ మహాభారత యుద్ధము)