ఈనాడు జీవితమే ఒక సమస్యల తోరణముగా కనుపట్టుచున్నది. ఆధునిక యుగమనగా ఏమిటో అర్థం చేసికోలేకపోతున్నాము. ఆధునిక లక్షణ మేమనగా పురుషులయందు సత్యము. స్త్రీలయందు శీలమును అభివృద్ధి పరచుకొనుటయే, ఒక విధముగా ఇదే ఆధునిక యుగమునకు ప్రమాణము. కోరికలను మితి మీరినట్లుగా పెంచుకొనుట ఆధునిక యుగ ప్రమాణముకాదు. కోరికలను తగ్గించుకొనుటయే ఆధునిక యుగ లక్షణము. కోరికలను తగ్గించుకొంటూ, సేవాభావమును పెంచుకొంటూ దివ్యత్వమైన ప్రేమతత్వాన్ని వికసింపజేసు కోవడం, ప్రధాన లక్ష్యంగా ఉంచుకోవాలి.
(జ.పు.81)