మన భావములను పురస్కరించుకొనియే, మన ప్రవర్తన కొనసాగుతూ వస్తుంది. "యద్భావం - తద్భవతి". మన హృదయము పవిత్రమైనది. ఇందులో ఏ విధమైన అభ్యాసములను, తలంపులను మనము ప్రవేశ పెడుదుమో వాని ప్రభావమే ఈ హృదయం పొందుతుంది.
Sow an action - reap a tendency
Sow a tendency - reap a habit
Sow a habit -reap a character
Sow a character - reap a destiny
you are the maker of your destiny
You can do or undo it
కొన్ని సమయములలో - Emotional excitement ఉంటున్నది. అది కొంచెం చల్లార్చుకోవాలి. దీనిని మీరు Control చేసుకుంటే ఎంతో ఆదర్శ జీవులుగా ఉంటారు. మాటలు తగ్గించుకోండి - కొంత వరకు సత్యాన్ని గుర్తించండి - పవిత్రత పెంచుకొండి - జీవితమును ఆనందంగా జీవించండి.
జీవితములో ఏదీ Happy గాలేదు. అప్పటి కప్పుడు వస్తుంది. అప్పటికప్పుడు పోతుంది. అంతా Passing clouds. Permanent Happiness ఒక్క దైవత్వములో మాత్రమే ఉంటున్నది. ఇది Heart to Heart-Love to Love. ఇదే మీరు పెంచుకోవాలి. ఇదియే నిజమైన భక్తి ప్రపత్తులకు నిదర్శనము.
(దే.యు. పు 110
(చూ కృష్ణుడు, యజ్ఞము, సంకల్పము)