యథార్థ జ్ఞానులు, క్షీరం క్షీరే యథాక్షిప్తం, తైలం తైలే జలం జలే సంయుక్త మేక తాం యాతి తథాత్మన్యాత్మవి న్మునిః అనట్లు కేవల జ్ఞాన సిద్ధిని పొందినవాడు పాలలో పాలవలే. నూనెలో నూనె వలె, నీటిలో నీటి వలె లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరము ఆత్మలో లీనమయి పోవును. కొంతమందికి మాత్రము కొన్ని కొన్ని సంస్కారములు మిగిలి ఉండును. ఆ సంస్కారములే సంకల్ప రూపముగా నిల్చి యుండును. ఆ సంస్కారములు తీరేటంతవరకు ఇష్టమొచ్చిన దేహములో లోకములో సంచరిస్తూ వుండును. అదియును భగవత్ సంకల్పము వల్లనే. వారినే దైవాంశ సంభూతులని అందురు.
(సం. పు. 75)