దేవాలయంలో నిత్యం దీపం పెడుతారు. ఆదీపం ఎవరికోసం? దేవుని కోసమా? ఆయనకీ ప్రమిద ఎందుకు? ఆయనే జ్యోతి స్వరూపం. కోటి సూర్య ప్రభాసమానుడు కదా! ఆయన తేజాలన్నిటికీ అతీతం. ఈరాతి మందిరాన్ని ప్రకాశమానం చేయటం కోసం కాదుదీపం! నీ హృదయాంతరాళంలో జ్ఞానజ్యోతిని వెలిగించుకో అని గుర్తు చేస్తుంది. ఆ దీపం! గుడి అంటే నాలుగు రాతి గోడలు కాదు. “దేహో దేవాలయ ప్రోక్తో" దేహమే దేవాలయము అని చెప్పారు. మరి ఆ గుడిలో దేవుడెవరు? జీవోదేవస్సనాతనః" సనాతనంగా వున్న దైవం జీవుడే.
(శ్రీ.సా.గీ.పు.8)