ప్రతి మానవుని యందునూ ఒక ‘విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసమే లేకుండిన దేవిని ఆశించలేడు. కనుక ప్రతి ఒక్కరూ ఆ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
"ఈశావాస్యం మిదం జగత్". ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
"ఈశ్వర సర్వభూతానాం" ఈశ్వరత్వం అన్ని జీవులలోనూ చైతన్యంతో కదులుతునే ఉన్నది. “ఈశ్వరుడు అనగా ఏమిటి? సకల ఐశ్వర్య స్వరూపుడే. ఇది ఆరు రకముల గుణములతోకూడఉంటున్నది. 1 ఐశ్వర్యము 2 దానము 3. యశస్సు 4. జ్ఞానము 5. రసము 6. ఆనందము - ఈ ఆరింటే తత్త్వములనే ఈశ్వరత్వము" అంటున్నారు. కనుకనే షడ్తెశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అన్నారు. ఇతనినే శంకర అని పిలుస్తూ వచ్చారు. శం అనగా చిదానందం, ఆత్మానందం, కర’ అనగా అందించేటటువంటివాడు. ఆత్మానందమును, చిదానందమును అందించేటటువంటి వాడు శంకరుడు . కనుక దైవత్వముతో అన్ని రకముల నామముల స్వరూపం కూడనూ ఇమిడి ఉంటున్నది. ప్రతి మానవుని యందునూ ఈశ్వరత్వము అనేది తాండవమాడుచున్నది.
(శ్రీ.ఏ. 2002 పు.22)
ప్రేమస్వరూపులారా! ఈ రాత్రి అంతా చక్కగా నామస్మరణ చేసి, పవిత్రమైన శక్తినంతా ప్రపంచానికి ప్రసరింపజేయండి. అదియే ఈశ్వరత్వానికి సరియైన గుర్తు, గాలివలె సంచరించేవాడు ఈశ్వరుడు . గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుంటుందో, అదే విధంగా ఈశ్వరుడు సంచరిస్తుంటాడు. కనుక మీ ప్రేమను ప్రపంచమంతా ప్రసరింపజేయండి. నామస్మరణ ను ప్రపంచంలో చక్కగా ప్రచారం చేయండి!
(శ్రీ.ఏ. 2002 పు.24)
(చూ॥ కాలస్వరూపుడు, బ్రహ్మవిద్య. భగవంతుడు, వరలక్ష్మి వ్రతము. సంపర్కము, శంఖనాదము, హిమాచలం)