అన్నదానముకంటె అధికదానం బేది?
తల్లితండ్రులకన్న దైవమేది?
జపతపంబులకన్న సత్యశీలం బేది?
దయకంటె నెక్కువ ధర్మమేది?
సుజన సంగతి కన్న చూడ లాభంబేది?
క్రోధంబుకన్న శత్రుత్వమేది?
ఋణము కంటెను నరునకు రోగమేది?
ధరణి నపకీర్తి కంటెను మరణమేది?
సర్వదా కీర్తికంటెను సంపదేది?
స్మరణ కంటెను మించు నాభరణమేది?
(స. సా.వా. 1989 పు 164)