ఏకాంతవాసము దీనియందు అభిరుచి కలిగియుండవలెను. అనగా కేవలము శరీరమును మాత్రము ఎవ్వరూ జన సంచారము లేని స్థానమున అడవులయందు వుంచినంత మాత్రమున ఏకాంత వాసము కానేరదు. మనస్సును నిర్విషయం చేసుకొనుట అభ్యంతర ఏకాంతం. ఒక్క భగవంతుని తప్ప అన్య చింతలకు కానీ అన్య వ్యక్తులతో కానీ చేరక, ఒక వేళ పెద్దలైన సాధకుల దగ్గర చేరిననూ నిర్విషయ సంబంధమును కలిగియుండుట.
(గీ. పు. 212)