దేహమునందు, అణుశక్తి నందుకొన్ని విధము లైన శక్తులు ఉంటున్నాయి. ఇది యే షడ్ శక్తులు. 1. ఐశ్వర్యము 2. ధర్మము, 3. కీర్తి, 4.సంపద 5. ఙ్ఞానము. 6.వైరాగ్యము. షడైశ్వర్య స్వరూపుడు భగవంతుడు. కాబట్టి ప్రతిశక్తి యందునూ ప్రతి వ్యక్తి యందూ పడైశ్వర్యములు ఉంటున్నాయి. కనుక మనం దైవం కాదని ఎట్లా చెప్పగలము? మనముకూడా దైవమే. దేహ భ్రాంతి వస్తే దేహాన్ని మర్చిపోతావు. దేహమనే అభిమానము మనము పెంచుకున్నంతవరకూ దైవాభిమానము రాదు.
(శ్రీవా.ఏ.1995 పు.37)