పక్షికి కుడి రెక్క ఋతం. ఋతము అనగా వేదాంతమునందు సత్యము అన్నారు. ఋజుమార్గమును చూపేదే ఋతం. సత్యమునకు ఋతమునకును వ్యత్యాసమున్నది. సత్యమే ఋతము. ఋతమే సత్యమని చెప్పరాదు. మాటతో చెప్పిన దానిని చేతితో చేయుటను, చేతితో చేసిన దానిని మాటతో చెప్పటము సత్యం. ఋతం అది కాదు. మనస్సులో పుట్టినదానిని మాటతో చెప్పటము, మాటలో చెప్పిన దానిని చేతితో చేయటము, ఇట్లా త్రిగుణాత్మకమైన దానిని ఋతము అన్నారు. ఋతము మానసిక సంబంధమైనదని, సత్యము లౌకిక సంబంధమైనదని నిర్ణయించుకోవచ్చు. సత్యం త్రికాలాబాజ్యం అంటారు కాని ఋతం త్రిలోకాబాజ్యం. మనస్సునందు వాక్కునందు క్రియయందు ఏకత్వాన్ని పొందేది ఋతము. ఋతము, సత్యము ఈ రెండు రెక్కలు చేరినప్పుడే బుద్ధిసరియైనదిగా వుంటుంది. శ్రద్ధ మాత్రముండి ప్రయోజనము లేదు. శ్రద్ధకు ఋతసత్యములు ఏకం కావాలి. కనుక బుద్ధి అంటే సామాన్యమైన బుద్ధిగా భావించరాదు. శ్రద్ధ ఋతం సత్యములతో కూడినట్టిది. ఈ బుద్ధి.
(బృత,పు ౯౯)
(చూ|| బుద్ధి, విలియమ్ గ్లాడ్స్టన్, సత్యము)