ఓంకారోచ్చారణ మనసులో జరగవలెను. కానీ, వాక్కుతో కాదు అని తెలియజెప్పెను. తరువాత, అర్జునునకు మరొక సంశయము మొలకెత్తెను. "కృష్ణా! జపతోనాస్తి పాతకం" అన్నావుకదా, జపముచే పాపము మాత్రము పోవును, పరమాత్మప్రాప్తి యెట్లు లభించును ?" అని అడిగెను, అపుడు పరమాత్ముడు అర్జునుని ప్రశ్నకు సంతసించి, "పార్థా! నీవడిగిన ప్రశ్న చాల అవసరమైనదే కాని, అది ప్రత్యేకించి వేరు క్రియగా చేయనక్కర లేదు. ఓంకార మంత్రమును ఉచ్చరించుచూ, ఆ ఓంకార మంత్రార్థ మైన పరమాత్ముని భావన చేసినంత మాత్రమున పరమాత్మ ప్రాప్తి కూడా చేకూరును"(గీ. పు.146)
మనసును ఇంద్రియముల నుండి ఉపసంహరించు అభ్యాసమును చాలా కాలము పాటించిన దానికి అట్టి శక్తి సామర్థ్యములు అలవడును. ఓంకారోచ్చారపూర్వకంగాపరమార్మను స్మరిస్తూ ప్రాణమును వదలినట్టివాడు తప్పక భగవంతునిపొందుచున్నాడు."(గీ.పు.147)
ప్రణవము లేక ఓమ్ ఆధ్యాత్మిక శిశువు మూడు చక్రముల బండి. ఆ మూడు చక్రములు ఆ.ఉ.మ్. ఆ మూడు కలిసి ఓమ్ అయినది. ఇది జీవిత ఉచ్చ్వాస నిశ్వాసములలో అంతర్గతముగా నున్న ప్రధాన (మొదటి) శబ్ధము. ప్రతి శ్వాసతోను సోఽహం ఉచ్చc గాలి పీల్చునపుడు సో అనియు, విడుచునపుడు హం అనియు అందుము. దాని అర్థము అతడు - నేను ఈ బాహ్య ప్రపంచమంతటను వ్యాపించియున్న అతడు సర్వభూతాంతరాత్మయైన నేను గా ఉన్నాడను విశ్వాసము కలిగించుచున్నది. గాఢ సుషుప్తిలోనున్నప్పుడు ఇంద్రియములు, మెదడు, మనస్సు వాటి కార్యములు చేయక, ప్రచ్ఛన్న స్థితిలో వున్న సమయములో అతడు", "నేను" విడిగా నుండక, క్రమముగా క్షయమై, సోహం శబ్దము "ఓమ్ శబ్దముగా మారిపోయి, బాహ్యము అంతరములో కలిసిపోవు ఏక సత్యమును నిరూపించును.
ఓమ్ కి ఇతర ప్రాముఖ్యతలు చాలా కలవు. సత్యాన్వేషకునకు ఓమ్ ప్రణవోచ్ఛారణ విలువైన సాధనగా ఉపకరించును. అది సూర్యకిరణములలోని సప్తవర్ణములు కలసిపోయిన వర్ణ రహిత ప్రకాశము వంటిది. మానవుడు ఏ దివ్యత్వము నుండి వచ్చెనో ఆ దివ్యత్వపు హద్దులు చేరుకోవలెను.
(శ్రీ.స. సూ. పు.85)
జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలను ప్రాజ్ఞులు క్రమముగా అకార,ఉకార,మమకారములకుసరిపెట్టుచున్నారు. ఈ మూడింటి పర్యవసానమే ఓంకారము. అకార ప్రధానమగు ఓంకారోపాసనము వలన సర్వకామ్య ప్రాప్తి సిద్దించును. ఉకార ప్రధానముగా చేయు ఓంకారోపాసనము వలన జ్ఞానసంపద కలుగును. మకార ప్రధానముగా చేయు ఓంకారోపాసనము వలన లయమగుచున్నది. ఇట్లు తెలుసుకొని ఓంకారోపాసన చేయువారు జగత్తు యొక్క యథార్థమును తెలిసికొనగలరు.
అకారాది మాత్రాత్రయము ఓంకారమున లయ మగుటచే అది అమాత్ర అగుచున్నది. ఓంకారము శాంతము, శివము, అద్వైతము. ఇట్టి జ్ఞానము వలన బ్రహ్మా త్త్మెకము పొంద వచ్చును. ప్రణవము సృష్టి, స్థితి, లయ కారణమనియూ సర్వశోకనాశక మనియు 24-29 కారకలతో స్తుతింపబడుచున్నది. ఇంతియే కాదు, ఓంకార త త్త్వ మును తెలిసికొని మననము చేయువాడు పరమాత్మ త త్త్వ మును తెలసికొనినవాడగుచున్నాడు.
(శ్రీ.సూ , పు.147/148)
(చూ|| పంచభూతములు, భక్తి,, శాస్త్ర యోనిత్వాత్)