ఈనాడు "నేనెవరు" అని ప్రశ్న వేసుకోకుండా "నీవెవరు, అతనెవరు ఇతనెవరు" అని ప్రశ్నివేస్తే మీరంతా గొఱ్ఱెలతో సమానమే. మొట్టమొదటనేనెవరు? అని ప్రశ్నవేసుకో Who am I? పుట్టినపుడు నీవు ఏరీతిలో పుట్టావో. గిట్టినప్పుడు కూడా ఆరీతిలో గిట్టరాదు. పుట్టినప్పుడు నీకు కోహం కోహం అని ఏడ్చినావు.
కోహం అనగా నేనెవరు అని అర్థము. చచ్చేదాకా నేనెవరు అని చేస్తే పుట్టి ప్రయోజనమేమి? పుట్టినపుడు కోహం అని పుట్టావు చచ్చినపుడు సోహం అని చావాలి. అదే సార్థకము. కనుక మానవుని యందున్న అహంకారతత్వాన్ని నిర్మూలం గావించుకోవాలంటే ఒక మార్గాన్ని అనుసరించాలి. ఒక్క భగవత్ మార్గములో తప్ప అన్యమైన యేమార్గము లోనూ యిది ఫలింపచేయదు. అహంకారము కల్గినపుడు నీ వోక ప్రదేశములో కూర్చో, నీ శ్వాసను నీవు పరిక్ష గావించు. నీ ఉచ్ఛ్వాసనిశ్వాసములు యేమి పలుకు తున్నాయో విచారణచేయి. అదే సౌండ్ సో…హం." సో…హం శ్వాసను నీవు చక్కగా అనుసరించు సఃఅహం ఈ రెండు పదములు చేరి సోహం అయినది. సః = బ్రహ్మ అహం = నేను = అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాసి, అనే భావమును మనలో ఆవిర్భవింప చేసుకొని అభివృద్ధి గావించుకొంటూ వస్తే ఈ అహం యే మాత్రమూ భాధించదు. దీనినే వేదాంత పరిభాష యందు హంసగాయత్రి అంటారు. హం అనగా హంస, హంసగాయత్రే ఈ సోహం..
(బృత్ర.పు.102)
మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు. ఇన్ని విచారములు సల్పుతున్నాడు. ఇన్ని విధములైన ఘనకార్యములు సాధిస్తున్నాడు. దీనికి యేది లైఫ్సో ర్సు? అదే ఆత్మ. లోపల వుండటంచేతనే దేహము యిన్ని పనులు చేస్తున్నది. ఈ కాన్షష్ నెస్ నీవు అని నీకు బోధిస్తున్నది. ఈ కాన్హష్ నెస్ సో. ఆదే. గాడ్, హమ్-ఐఐ యామ్ గాడ్. ఇదే ఆంతర్వాణిగా బోధిస్తున్నది. దీనిని హంస గాయత్రి అని చెపుతూ వచ్చారు. హంస అనగా ఏమిటి? మంచి చెడ్డలను విభాగము చేసేది హంస, ఏమిటి గాయత్రి. గాయత్రి అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఈ గాయత్రికే రెండవ పేరు సావిత్రి. మాస్టర్ఆఫ్ లైఫ్. ఈ గాయత్రికే సరస్వతి అని మూడవ పేరు. సరస్వతి అనగా వాక్ దేవతా స్వరూపిణి. ఈ సెన్సెస్ కి మాస్టర్, లైఫ్ కి మాస్టర్, వాక్ కి మాస్టర్ అయిన తత్వము గాయత్రినీలో ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ఉన్నది. దీనినే భూర్చువఃస్సువః అన్నది గాయత్రి భూ హు- బాడీ; భువః - లైఫ్, మూడవది ప్రజ్ఞ. దీనినే రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ అన్నారు. రేడియేషన్ - ప్రజాశక్తి వైబ్రేషన్ - ప్రాణశక్తి దేహమే మెటీరియలైజేషన్. కనుక భూర్భువస్సువః ఎక్కడో భూలోకము, భువర్లోకము, స్వర్గలోకమూ కాదు. దేహమే భూర్భువ స్సువః మూడులోకములూ మనయందే వుంటూన్నాయి. కనుక మానవుడు సామాన్యుడు కాడు. మానవుడు సాక్షాత్తూ చైతవ్యస్వరూపుడే, కాస్మిక్ డివైన్.
(శ్రీ. స.ది.పు. 11)