చీమలయందు ఐకమత్యము ఉంటున్నది. ఒక చీమ ఎక్కడైనా చక్కెరను చూసిందంటే, తానే వంటిరిగా మెక్కడానికి ప్రయత్నించదు. వెంటనే వెనుకకు పరుగెత్తుకొనిపోయి అన్ని చీమలను తీసుకు వస్తుంది. అన్ని చీమలు ఐకమత్యంగా ఆ చక్కెరను భుజిస్తాయి. అట్లే మనం ఎక్కడైనా అన్నం మెతుకులను జల్లితే ఒక కాకి చూసిందనుకోండి. ఆ కాకి మాత్రమే స్వార్థంగా ఆ మెలుకులను తినడానికి ప్రయత్నించదు. "కావ్, కావ్!" అని అది అరచుకుంటూ పోయి, అనేక కాకులను పిలుచుకొని వస్తుంది. ఈ విధంగా కాకులలో, చీమలలో ఐకమత్యం ఉన్నది కాని మమష్యులలో లేదు. ఇదే ఒక పెద్ద దోషము. ఒకే తల్లి గర్భంలో పుట్టిన పుత్రుల యందు కూడా ఈనాడు ఐకమత్యం లేదు. ఐకమత్యమే విజయానికి కారణమవుతుంది. ఐకమత్యం వల్లనే పాండవులు దిగ్విజయం సాధించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్బులు ఆదర్శప్రాయులుగా నిలిచారు. కాని, వాలి సుగ్రీవులలో ఐకమత్యం లేకపోవడం చేత, అనేక దుఃఖాలకు గురి అయినారు. కనుక, ఐకమత్యమే మహాబలము. అయితే ఇది ఏవిధంగా సాధ్యమవుతుంది? అందరి యందున్న ఆత్మ తత్వం ఒక్కటే అని గుర్తించాలి. ఈనాడు జాతి మతకుల భేదములను ఏమాత్రం విచారించకూడదు. మానవు లందరిదీ మానవజాతియే. ఇంకొక దానితో పోల్చడానికి వీలు లేదు. ఈ ప్రపంచానికి ప్రధానమైన పంచభూతములలో - గాలి దే కులం? నిప్పు చేకులం? వీటి దేకులం? పృధ్వి దేకులం? కనుక, మానవునిది మానవకులమే. ఈ కులములో మరల కులభేదము లెందుకు? ఈ యూనిటీ లేకపోవడం చేత ప్యూరిటీ అంతర్థానమయింది. దానితో డివినిటీ అట్టడుగున పడిపోతున్నది. ఈ నాడు యూనిటీ, ఫ్యూరిటీ, డివినిటీ ఈ మూడు పోయాయి, కమ్యూనిటీ మాత్రం మిగిలింది. ఈ కమ్యూనిటీని పట్టుకోవడం చేతనే కలహాలు బయలు దేరుతున్నాయి. కర్మమయమైన ఈ శరీరమునకు ధర్మమయమైన ఆహారాన్ని అందించాలి. అనగా ఆహారము సాత్వికమైనదిగా, స్వార్జితమైనదిగా, పవిత్రమైనదిగా, భగవదర్పితమైనదిగా ఉండాలి. అప్పుడే మానవుని యందు సాత్వికమైన గుణములు ఆవిర్భవిస్తాయి.
అధర్మార్జిమైన ఆహారము మనలను అధర్మ మార్గములో ప్రవేశపెడుగుంది. ఏ విధముగా నంటే - మనము తినే ఆహారము స్థూలరూపంలో మలంగా విసర్జింప బడుతున్నది. సూక్ష్మమైన ఆహారము కండరాలుగా రక్తంగా మారుతున్నది. ఇంక అతి సూక్ష్మమైన ఆహారమే మనస్సుగా మారుతున్నది. కనుక అట్టి ఆహారమో అట్టి మనస్సు రూపొందుతుంది.
(శ్రీ బా. ఉ. పు. 138/139)
చీమల్లో కాకుల్లో ఉన్న ఐకమత్యం మానవుల్లో లేదు. ఒకే తల్లి గర్భాన్ని పుట్టిన బిడ్డల్లోకూడా యిట్టి ఐకమత్యం కనబడదు. ఐకమత్యము లేకపోవుట చేత పూర్వం స్వాతం
త్త్రాన్ని కోల్పోయాము. అనేక కష్టనష్టాలకు గురి అయ్యాము. ఐకమత్యమే మహాబలమని తెలియదా?
మా పైన ఎవరైనా పరరాజు, దండెత్తి వచ్చినప్పుడు మేమంతా 105 మంది అన్నదమ్ములము. కాని, మాలో మాకే ఏమైనా అభిప్రాయ భేధాలు కలిగితే మేము 5 మంది మాత్రమే అన్నాడు ధర్మరాజు. ఇదెంతటి ధర్మమో చూడండి!
మన దేశం పైకి ఎవరైనా దండెత్తి వస్తే అన్ని పార్టీలు వారు ఏకం కావాలి. “నాపార్టీ, నీపార్టీ" అంటు దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయకూడదు. మీలో మీరు చావండి. కాని దేశంపైకి ఎవరైనా వస్తే, అందరూ కలిసి దేశం కోసం ప్రాణాలు విడవవలసిందే! దేశాన్ని రక్షించవలసిందే.
ఇదే నిజమైన స్వాతంత్ర్యము. ఇదే విజమైన ఐకమత్యము. ఇది లేకుండా "నీది - నాది" అని పోట్లాడుతూ కూర్చుంటే ఇంక దేశం ఏ విధముగా అభివృద్ధి చెందుతుంది?
ప్రేమ స్వరూపులైన భక్తులారా.... ప్రతీ ఒక్కరు ఐకమత్యమును ప్రేమను పెంచుకొని, దేశ్యమాన్ని, యావద్విశ్వ క్షేమాన్ని కోరాలి. ఇదియే నిజమైన భారతీయ సంస్కృతి.
"లోకా స్పమస్తా స్సుఖినో భవంతు" "నా భారతదేశం మాత్రమే బాగుండాలి అని అనుకోకూడదు" అన్ని దేశాలు బాగుండాలి అని అనుకోవాలి. ప్రపంచములోని 575 కోట్ల మంది ప్రజలందరూ భగవంతుని బిడ్డలే! ఈ దేశము, ఆ దేశము అని భేధాలు పెట్టుకోకూడదు.
(దే. యు.క. పు. 40/41)
ఐకమత్యమే బల మందరి క్షేమంబు
ఎంత కార్యమైన నెగ్గవచ్చు
చిన్న చీమలన్ని సర్పంబునున్ బట్టి
చంపుచుండ లేదా జగతియందు!
(స. సా..వా.2000 పు. 182)
"దేశం సమైక్యంగా ఉండాలి. విచ్చిన్నం చేయకూడదు. మానవ దేహంలో కాలు, చెయ్యి మున్నగు అనేక అంగాలు ఉన్నాయి. దీనిని ముక్కలు ముక్కలు చేస్తే ఎంత రక్తం పోతుంది! ఎంత బలహీనత ఏర్పడుతుంది! యోచించండి. దేహమెంతో దేశమూ అంతే. హక్కులను అడుగవచ్చు. అందులో దోషం లేదు. కాని, వేర్పాటువాదం మంచిది కాదు. దారాలు విడిగా ఉంటే చిటికెన వ్రేలుతో సులభంగా కట్ చేయవచ్చు. కాని, దారాలతో నేసిన బట్ట దృఢంగా ఉంటుంది. ఐకమత్యమే మహాబలం. కనుక, అందరూ సమైక్యంగా జీవించాలి."
(స.పా.సి. 2000 పు.280)
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు
ఏక గర్భ జాతులటంచు కాంచరయ్య
అన్నలు ద్విజులు శూద్రాదులు తమ్ములు
బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా
గుణముచే క్రియలచే తనరు వర్ణము లెల్ల
గుణమున్న గ్రహియింప కూడునయ్యా
ద్విజుడు దుర్గుణుడైన కనగ శూద్రుడు కాదె
సుగుణి శూద్రుండు భూసురుండు కాడే
తనయులకు పితరులకు భేదంబు కలదే
ఐకమత్యంబు అన్నింట అభివృద్ధి పరచి
కలత విడనాడి ఐక్యంబు కంచరయ్యా
అపుడే ఈ దేశ మభివృద్ధి నొందునయ్య.
(భ. స. ప్ర. ప. పు. 23)
(చూ॥ అధర్వణ వేదము, బాబర్లేఖ. మెస్పెంజర్స్ ఆఫ్ సత్యసాయి, విశ్వకుటుంబము, సమాజము, హిందువులు)