ఊర్మిళ

లక్ష్మణుని భార్య ఊర్మిళ, సుమిత్రవలె ఆమె కూడా గొప్ప గుణవంతురాలు. ఆమెకున్న త్యాగము, ఔదార్యము ఎవ్వరికీ లేవు,అరణ్యానికి వెళ్ళిన తరువాత పధ్నాల్లు సంవత్సరాలపాటు తిరిగి రావడానికి వీలుండదు కదా! కనుక, ఆమెకు ఒకతూరి చెప్పిపోదామని లక్ష్మణుడు వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె తన గదిలో కూర్చుని సీతారామపట్టాభిషేక ఘట్టమును రంగులతో చిత్రిస్తున్నది.ఆమె చిత్రకళలో గొప్ప ప్రావీణ్యం కల్గినది. ఆ చిత్రమును తన తండ్రియైన జనకునికి పంపాలని ఆమె ఉద్దేశ్యం. ఇంతలో లక్ష్మణుడు వెళ్ళి "ఊర్మిళా !" అని కాస్త గట్టిగా పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి లేచింది. లేచేటప్పటికి ఆమె ప్రక్కనున్న రంగంతా తాను గీసిన చిత్రము పై ఒలికిపోయింది. "అయ్యో. దీనిని చెడగొట్టుకున్నానే" అని బాధపడింది. అప్పుడు లక్ష్మణుడు "ఊర్మిళా! విచారించకు. రాముని యొక్క పట్టాభిషేకమును కైకేయి చెడగొట్టింది. నీవు గీసిన పట్టాభిషేక చిత్రమును నీ భర్తయైన లక్ష్మణుడు చెడగొట్టాడు. కాబట్టి, నీవు బాధపడనక్కర్లేదు" అన్నాడు. జరిగిన సంగతి వివరించి, తాను రామ సేవ నిమిత్తం అరణ్యానికి వెళుతున్నట్లు చెప్పాడు. ఆమె ఆనందంగా అంగీకరించింది. తనను వదలిపెట్టి వెళుతున్నాడని బాధపడలేదు. తనను కూడా తీసుకువెళ్ళమని ఏమాత్రం ఒత్తిడి చేయలేదు.

 

“నాథా! నిన్సు, నీ సోదరుడైన శత్రుఘ్సుణ్ణి నా అత్తగారుసేవకోసమే కన్నారు.  నీవు రామ సేవ చేయడానికే జన్మించావు. శత్రుఘ్పుడు భరతునికి సేవ చేయడానికే జన్మించాడు. కాబట్టి, నీ కర్తవ్యాన్ని నీ వు నిర్వర్తించు. అయితే, నాకొక మాట ఇవ్వాలి. నీవు ఆరణ్యంలో ఉండే పధ్నాలు సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా నన్ను తలంచకూడదు. నన్ను తలుచుకుంటే సీతారాముల సేవకు అభ్యంతరం కల్గుతుంది. కనుక, నీవు నిరంతరం వారినే స్మరిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కల్గకుండా చూసుకో. ఈ పధ్నాలు సంవత్సరాలపాటు నన్ను పూర్తిగా మరచిపో" అని చెప్పింది. ఏ భార్యయైనా ఈ రీతిగా చెబుతుందా? ఎవ్వరూ చెప్పరు. ఆమె యొక్క విశాలమైనభావములకు లక్ష్మణుడే కరిగిపోయి కన్నీరు కార్చాడు. "ఊర్మిళా! నీకింతటి విశాలమైన భావాలున్నాయని నేను అనుకోలేదు. నీ విశాలమైన భావాలను నేను హృదయంలో నిల్పుకుంటాను" అన్నాడు. అప్పుడు ఊర్మిళ "నాభావాలను కూడా నీవు తలంచవద్దు. సీతారాముల యొక్క విశాలమైన భావాలను నీ హృదయంలో నిల్పుకో. వారిఆజ్ఞను శిరసావహించు. వారికి ఎలాంటి కష్టమూ కల్గ కుండా చూసుకో" అని కోరింది.

 

సుమిత్ర, ఊర్మిళల యొక్క గుణసంపత్తిని ఎవ్వరూ వర్ణించలేరు. ఊర్మిళవంటి గుణవంతురాలైన భార్య, సుమిత్రవంటి ఆదర్శవంతురాలైన మాతృమూర్తి ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.

 

యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు రాముడు "లక్ష్మణా! ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్యయైనా నాకు లభించవచ్చు. కాని, నీవంటి పోదరుడు లభించడు. నిన్ను కోల్పో యిన తరువాత ఇంకనేనెందుకుబ్రతికియుండాలి " అని పరితపించాడు. అక్కడున్న వైద్యులు సంజీవని మూలికద్వారా లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి వీలౌతుందని చెప్పారు. వెంటనే హనుమంతుడు ఆకాశమార్గాన సంజీవని మూలికయున్న పర్వతం వద్దకు వెళ్ళాడు. కానీ, ఆ మూలిక ఎలా ఉంటుందో అతనికి తెలియకపోవడంచేత ఆ పర్వతాన్నంతటిని పెకలించుకొని బయలుదేరాడు. నందిగ్రామం మీదుగా వెళుతూంటే భరతుడు అతనిని చూసి ఎవరో రాక్షసుడని భావించి ఆంబులు వదిలాడు. వెంటనే హనుమంతుడు పర్వతంతో పాటు క్రిందపడ్డాడు. నందిగ్రామ ప్రజలు, ఆయోధ్యావాసులు పరిగెత్తుకొని వచ్చి హనుమంతునిచుట్టూగుమికూడారు. హనుమంతుడుఅందరికీ -నమస్కరించి, భరతునివైపు చూసి భరతా! నీ సోదరుడైనలక్ష్మణుడు యుద్ధంలో మూర్చిల్లినాడు. అతనిని బ్రతికించే నిమిత్తం వైద్యులు సంజీవని మూలికను తీసికొని రమ్మన్నారు. సంజీవని ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుచేత, ఆ మూలికయున్న పర్వతాన్నంతటిని తీసికొని వెళుతున్నాను" అన్నాడు. లక్ష్మణుడు మూర్చిల్లిన వార్త వినగానే అందరూ "అయ్యో, లక్ష్మణుడు మూర్చిల్లినాడా? రాముడు బాధపడుతున్నాడా? ఎందుకు వీరికిన్ని కష్టాలు?" అని కన్నీరు కార్చారు; ఇంక ఆడవారైతే చెప్పనక్కర్లేదు. కాని, ఒక్కస్త్రీ మాత్రం కన్నీరు కార్చలేదు. ఆమెయే సుమిత్ర. "రామునికి ఎట్టి బాధలూ కలవు. నిరంతరంరామనామాన్ని స్మరించే నా కుమారుడైన లక్ష్మణునికి కూడా ఎట్టి ఆపదా సంభవించదు." అనే దృఢవిశ్వాసంతో ఆమె ధైర్యంగా ఉన్నది.

 

భరతుడు హనుమంతుణ్ణి డిర్మిళ వద్దకు తీసుకు వెళ్ళాడు. ఆమె తన గదినుండి బయటికి రాలేదు. లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తాను ఏ గదిలోనైతే ఉన్నదో, అతడు తిరిగి వచ్చేంతవరకు అదే గదిని వదలకుండా ఉన్నది. ఆమె ప్రతిజ్ఞ అంత దృఢమైనది. భరతుడు "వదినా! ఇదిగో ఇతడు హనుమంతుడు" అని పరిచయం చేశాడు. "నాయనా! ఎక్కడి నుండి వచ్చావు ?" అని ఊర్మిళ ప్రశ్నించగా, "అమ్మా! రామరావణ యుద్ధంలో నీ భర్తయైన లక్ష్మణుడు మూర్చిల్లినాడు. లక్ష్మణా! నీవు లేని బ్రతుకు నాకెందుకు?" అని రాముడు పరితపిస్తున్నాడు. లక్ష్మణుణ్ణిబ్రతికించే నిమిత్తం నేను సంజీవనిమూలికను తీసుకు వెళుతున్నాను" అన్నాడు. ఆ మాటలకు ఊర్మిళ పక్కున నవ్వింది. “హనుమా ! నీకు కూడా ఇంతమాత్రం తెలియదా? లక్ష్మణుని ఉచ్చ్వాసనిశ్వాసములందు కూడా రామనామం నిండియున్నది. అలాంటివానికి ఎట్టి ప్రమాదమూ జరగడానికి వీల్లేదు" అని పలికింది.

 

ప్రేమస్వరూపులారా! సుమిత్ర, ఊర్మిళల యొక్క భక్తిప్రవత్తులను గురించి

రాముయణంఎక్కడా వర్ణించలేదు. ధర్మమూర్తియైన మాతృమూర్తి సుమిత్ర. ప్రేమమూర్తియైన సతి ఊర్మిళ, ఈ ఇరువురూ జగత్తుకు ఎంతో గొప్ప ఆదర్శాన్ని అందించారు. మీరు కూడా సుమిత్రలు కావాలి. సుపుత్రులు కావాలి. అదియే ఈనాడు దేశం కోరుతున్నది. భారతదేశంలో రామచరిత్రను వినని వారుండరు. కొన్ని వేల సంవత్సరములు గడచి పోయినప్పటికీ ఈనాటికీ రామాయణం నిత్యనూతనంగా ప్రకాశిస్తోంది. నిరంతరం రామనామాన్ని స్మరించేవారికి, రామరూపాన్ని దర్శించే వారికి పునర్జన్మ ఉండదు.

 

రాముణ్ణి వీడి తాను క్షణమైనా ఉండలేనని సీత అరణ్యానికిబయలుదేరింది. లక్ష్మణుని భార్య ఊర్మిళ, సుమిత్రవలె ఈమె పేరు కూడా రామాయణంలో ఎక్కువగాకనిపించదు. సుమిత్ర, ఊర్మిళ ఇరువురూ త్యాగమయమైన జీవితాన్ని గడిపిన వ్యక్తులు, ఆదర్శప్రాయులు. లక్ష్మణుడు సీతారాముల వెంట తాను ఆరణ్యానికి వెళుతున్నానని చెప్పినప్పుడు ఊర్మిళ ఏమాత్రం విచారించలేదు. తన భర్త పధ్నాలు సంవత్సరాలపాటు తనను విడిచి అరణ్యానికి వెళుతున్నాడంటే, ఏ భార్యయైనా ఊరుకుంటుందా? ఎన్ని ప్రశ్నలో వేస్తుంది. “అతని వెంట నీవు వెళ్ళవలసిన అవసరమేముంది? నీవు వెళ్ళాలనే నిబంధన ఏమీ లేదు కదా! కనుక, నీవు వెళ్ళనక్కర్లేదు" అని వాదిస్తుంది. కాని, ఊర్మిళ ఏమాత్రం అడ్డుచెప్పలేదు. “నాథా! సీతారాములను సేవించే భాగ్యం నీకు మాత్రమే లభించింది. నీవు చాలా అదృష్టవంతుడవు. ఇంక క్షణమైనా ఆలస్యం చేయకుండా బయలుదేరు." అని చెప్పింది. "ఊర్మిళా! ఇంక పద్నాలు సంవత్సరాలపాటు నీవు సీతారాములను దర్శించడానికి వీలుకాదు కదా! కనుక, నీవు ఒక్కసారి వెళ్ళి సీతామాత ను దర్శించుకొనిరా" అని చెప్పాడు లక్ష్మణుడు. కాని, ఊర్మిళఅక్కడి నుండి కదల్లేదు. "నాథా! నీవు సీతారాముల వెంట -వెళ్ళడానికి నావలన ఏమైనా అభ్యంతరం కలుగవచ్చు. కనుక, ఆలస్యం చేయక తక్షణమే బయలుదేరు. వారిసేవలో పాల్గొను. నీ పవిత్ర సేవలకు అడ్డురాకుండా ఉండే నిమిత్తం నేనిక్కడే ఉంటాను." అన్నది. లక్ష్మణుడు పట్టలేని ఆనందాన్ని పొందాడు. లోకంలో ఇంతటి త్యా గభావం కల్గిన ప త్నులు కూడా ఉంటారా, అని ఆశ్చర్యపోయాడు.

 

యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లిప్పుడు హనుమంతుడు సంజీవని మూలికయున్న పర్వతాన్ని పెకలించి పట్టుకొని ఆకాశమార్గాన నందిగ్రామం మీదుగా వెళుతున్నాడు. భరతుడు అతనిని చూసి ఎవరో రాక్షసుడని భావించి ఆంబులు ప్రయోగించాడు. హనుమంతుడు పర్వతంతో పాటు క్రింద పడ్డాడు. భరతునికి నమస్కరించి, యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినాడని. అతనిని పునర్జీవితుణ్ణి గావించే నిమిత్తం తాను సంజీవనిమూలికను తీసికొని వెళుతున్నానని చెప్పాడు. లక్ష్మణుడు మూర్చిల్లిన వార్తవిని కౌసల్య దు:ఖించింది. కాని, సుమిత్ర ఏమాత్రం బాధపడలేదు. "నా కుమారుడు రామ సేవ నిమిత్తం వెళ్ళివాడు. కనుక, అతనికి ఎట్టి అపదా సంభవించదు" అన్నది. దు:ఖంలో మునిగియున్న కౌసల్యకు ధైర్యం చెప్తూ "అక్కా! నీవు విచారించవలసిన విషయం కాదిది. రామునికి ఎలాంటి ఆపదా సంభవించదు. రామునికి సహాయంగా లక్ష్మణుడున్నాడు కదా! ఒకవేళ లక్ష్మణుడు శాశ్వతంగా కన్నుమూస్తే నా రెండవ కుమారుడైన శత్రుఘ్నుణ్ణి రామసేవకై పంపుతాను" అన్నది. ఏ తల్లియైనా ఇంతటి త్యాగానికి పూనుకోగలదా? హనుమంతుడు ఊర్మిళతో “ఆమ్మా! రాముడు లక్ష్మణుణ్ణి తన రెండవ శరీరంగా, తన రెండవ ప్రాణంగా భావిస్తాడు. అలాంటి లక్ష్మణుడు మూర్చిల్లడంచేత రాముడు చాలా దు:ఖిస్తున్నాడు" అని చెప్పాడు. అప్పుడు ఊర్మిళ పక్కున నవ్వి, "హనుమంతా! శ్రీరాముని యొక్క స్వభావమును ఈ జగత్తులో ఎవ్వరూ గుర్తించలేరు.రాముడు సాక్షాత్తు పరమాత్ముడు. అతను విచారించవలసిన అవసరం లేదు. ఇదంతా కేవలం అతని లీలానాటకమే. ఇంక నా పతియైన లక్ష్మణుని విషయానికి వస్తే, అతని శరీరంలో అణువణువులోనూ, కణకణములోనూ రామనామమే నిండి యున్నది. కనుక, అతనికెట్టి ప్రమాదమూ జరగడానికి వీల్లేదు. నిజానికి అది మూర్చ కాదు. తాను హాయిగా, ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు" అన్నది. ఇంక క్షణమైనా ఆలస్యం చేయక హనుమంతుణ్ణి బయలుదేరమని చెప్పింది. "నేను జనకమహారాజు కుమార్తెను, దశరథ మహారాజు కోడల్ని, లక్ష్మణుని భార్యను. కనుక, నాకు ఎలాంటి భయమూ లేదు. నా భర్తకు ఎట్టి ఆపదా సంభవించదు" అన్నది. ఊర్మిళ స్వభావం నిర్మలమైనది, నిత్యశుద్ధమైనది, నిస్వార్థమైనది. కాని, ఆమె గొప్పతనాన్ని ఈనాటివరకు భారతీయులే గుర్తించుకోలేదు. సుమిత్రగురించి కూడా భారతీయులకు తెలియదు. ప్రజలు సీతారాములను మాత్రమే గొప్పగా వర్ణిస్తారుగాని, లక్ష్మణ శత్రుఘ్నులుచేసిన సేవలను గురించి, వారి పత్నుల ఆదర్శం గురించి ఎవ్వరూ చెప్పుకోరు. కేవలం సీతారాములను స్మరిస్తే సరిపోదు. రాముని సోదరులు, వారి పత్నులు అందించిన ఆదర్శాలను కూడా మనం స్మరించాలి. దశరథుని పుత్రులు నలురూ నాలు వేదముల వంటివారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ఆడర్వణవేదములే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపాలను ధరించి దశరథ మహారాజు ఇంట్లో ఆడుకున్నాయని వసిష్ఠులవారు వర్ణించారు.

 

ముఖ్యంగా మీరు గుర్తించవలసిందేమిటంటే, భగవంతునికి ఎట్టి ఆపదలు సంభవించవు. లోకానికి ఆదర్శమును అందించే నిమిత్తం తాను ఈ విధమైన నాటకమాడు తుంటాడు. ఎవరి హృదయం పవిత్రంగా ఉంటుందో అట్టి మహనీయులకు మాత్రమే ఈ సత్యాన్ని గుర్తించడానికి వీలౌతుంది. లక్ష్మణునియొక్క పవిత్ర చిత్తమును ఒక్క ఊర్మిళ మాత్రమే కనిపెట్టగల్గింది. సుమిత్ర తల్లి కాబట్టి తన కుమారుల తత్త్వమును అర్థం చేసుకోగల్గింది. సుమిత్రవంటి పవిత్రమైన మాతృమూర్తులు ఈనాడు ప్రపంచానికి అత్యవసరం. రామాయణము నందు తెలుపనటువంటి విషయాలు ఇంకా ఎన్నో చిత్రవిచిత్రమైనవి ఉన్నాయి. వాటినన్నింటినీ మీరు గుర్తించి వర్తించాలి. ఊర్మిళ జనక మహారాజు యొక్క స్వంతబిడ్డ. సీత భూమిని దున్నేటప్పుడు దొరికిన బిడ్డ. ఆమె శక్తిస్వరూపిణి. సీత భూజాత కాబట్టి ఆమెలో నూటికి నూరుశాతం Magnetic Power (ఆకర్షణశక్తి) ఉన్నది. రాముడు పరమాత్మ కాబట్టి, అతనిలో కూడా ఆకర్షణ శక్తి పరిపూర్ణంగా ఉన్నది. కనుక, జనకుడు సీతను రామునికిచ్చాడు.

 

ఊర్మిళ ను లక్ష్మణునికిచ్చాడు. లక్ష్మణుడెవరు? ప్రపంచాన్నే మోసే ఆదిశేషుడు.

ఊర్మిళ గొప్ప గుణవంతురాలు. ఈనాడు ప్రజలు కైక పేరు, మంథర పేరు జ్ఞాపకం పెట్టుకుంటారు గాని, ఊర్మిళ పేరును ఎవ్వరూ జ్ఞాపకం పెట్టుకోరు. ఊర్మిళ స్వభావం చాలా సున్నితమైనది. పతి ఆరణ్యానికి వెళ్ళే సమయంలో తాను ఏ గదిలో ఉన్నదో అతను తిరిగివచ్చేంతవరకు ఆ గదిలోనే ఉంది. “నాథా! నీవు పధ్నాలు సంవత్సరాల తరువాత తిరిగి వచ్చేంతవరకు నేనిక్కడే ఉంటాను" అని చెప్పింది. ఆమె చిత్రకళ యందు ప్రవీణురాలు. తన సమయాన్నంతా చిత్రకళకే వినియోగించింది. దృశ్యకల్పితమైన జగత్తుపై ఆమె ఎలాంటి కోరికలు పెట్టుకోలేదు. నేను చెప్పవచ్చునుగాని, అందరూ అర్థం చేసుకోలేరు. సీత పట్టాభిషేకంకోసం పసుపుపచ్చని చీర కట్టుకున్నది. ఆ చీరతోనే అరణ్యంలో పధ్నాలు సంవత్సరాలున్నది. ఊర్మిళ కూడా అంతే. లక్ష్మణుడు తనను వదలి పెట్టి వెళ్ళే సమయంలో ఏ చీర ధరించిందో పధ్నాలు సంవత్సరాల తరువాత అతను తిరిగి వచ్చేంతవరకు అదే చీరతో ఉన్నది. దేహభ్రాంతి లేనటువంటివారు జనకుని బిడ్డలు. జనకుడు దేహాభిమానం లేనటువంటివాడు కనుకనే, అతనికి వైదేహిరాజు అని పేరు వచ్చింది.

(స.సా..మే. 2002 పు. 144/153)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage