ప్రతి మానవుడు ప్రేమ స్వరూపుడే! ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాదుల దోషంవల్ల మీలో కోపము, తాపము, అసూయ, డంబము ఇత్యాది దుర్గుణాలు కల్గుతుంటాయి. ఎట్టి
ఫుడ్డో " అట్టి "హెడ్డు". ఎట్టి "హెడ్డో" అట్టి గాడ్. ఫుడ్, హెడ్, గాడ్ - మూడూ అవినాభావ సంబంధం కల్గినవి. కాబట్టి, మీరు మొట్టమొదటి నుంచి ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆహారం అంటే విలువైన ఆహారం కాదు. సాత్త్వికమైన ఆహారం. సాత్వికాహరం భుజించటం వల్ల మీలో సాత్త్వికమైన భావాలే కల్గుతాయి. మీరు పలికే ప్రతి పలుకు పవిత్రమైనదిగానే ఉంటుంది.
(స. సా.ఆ 2000 పు. 232)