సాధనకు క్రమబద్ధమైన అలవాట్లు’ ఆహార నిద్రా వ్యాయామాలలో పరిమితి అవసరం. ఉపవాసాలవల్ల బుద్ధి బలహీనమౌతుంది. వివేచనా శక్తి నీరసిస్తుంది. దేహమునూ బుద్దిని ఆత్మనూ సమానంగా పోషించుకోవాలి. ఇనుపకండరములూ, ఉక్కు నరములు వుంటే కాని మీతలలో అద్వైత భావన నిలుపుకోజాలరు. విశ్వజనీన శక్తి, శాశ్వత సత్యమూ మీరూ ఒకరే అనే భావన అద్భుత పరిణామాలు చేకూర్చగలదు. ఆ శక్తిలేనివారు దాస్యభావమును, అనుషంగిక పాత్రలను మాత్రమే ఊహించుకోగలుగుదురు. సత్యమును సత్యముగా అసత్యమును ఆసత్యముగా దర్శించుటకు స్పష్టమైన దృష్టి ధైర్యవంతమైన దృష్టి అవసరం.
(వ.1963 పు.39)