అరణ్యకాలు పద్య గద్య రూపమైనవి. వానప్రస్థ ఆశ్రమము స్వీకరించినవారు, అరణ్యములలో జీవించుచు, అధ్యయనము చేయుట వలన వీటికి అరణ్యకాలని పేరు వచ్చినది. అనగా ఒంటరిగా ప్రశాంతముగా కాలము గడుపువారు. ఈ సంహితను ఆధ్యయనము చేయుటచేత అరణ్యకమైనది. అనగా జనసమూహములో కాక ఒంటరి జీవితము గడుపువారు. ఆధ్యయనము చేయునవి అరణ్యకాలు. వీటిలో కర్మకాండ యొక్క చరమదశ, బ్రహ్మకాండ ప్రారంభమవుతుంది.
(లీ.వా. పుట 6, 7)
(చూ: వేదము)