కులమత ద్వేషాలు కూలద్రోయుడటంచు
చేయెత్తి బోధనల్ చేయవలయు
దీనుల సేవయే దివ్య మార్గమటంచు
పలుమారు గట్టిగా పలుకవలయు
నామ చింతన చేయువరుని నామి సన్నిధి చేర్చి
అమృతత్త్వము నందించునని నెరుగవలయు,
(బా.జీ.జ.స. పు. 9)
అమృతత్త్వమును చేరే మార్గము యేమిటి? అనేక పర్యాయములు చెప్పాను. .....మానవునియందున్న బలహీనతలు అనగాకోపము,తాపము,ఈర్ష్య,అసూయ,దంభముయిత్యాదివికారగుణములనుదూరముచేసుకున్నప్పుడే అమృతత్వమనే సత్యము అర్థమవుతుంది. గీతయందు బోధించిన యిరువది ఆరు గుణములలో ప్రధానమైన కొన్ని గుణములైనా అభ్యసించునప్పుడే యీ నిత్యసత్యమైన ఆత్మతత్వము కొంతవరకైనా అర్థము చేసుకునేందుకు సాధ్యమవుతుంది. ఇందులో ఓర్పు అత్యవసరమైనది.
(శ్రీ.గీ. పు. ౨౦౬౨౦౭ )
(చూ॥ గుండె, సుఖము)