రావణుడు, భస్మాసురుడు, కంసుడు ఇత్యాది వ్యక్తులు నిరంతరము భగవన్నామమునుస్మరిస్తూ ఉండినప్పటికిని వారి అసురత్వము ఏ మాత్రము తగ్గలేదు. దీనికి కారణ మేమిటి? వారి మనోయంత్రములు నిరంతరము "అహందేహా⬑స్మి" అనే భావముతో కూడినవి. వీరు ఎంతో కాలము తపస్సులు చేశారు. ఈ తపస్సు యొక్క యంత్రము కూడను అహందేహా⬑స్మి, అహందేహా⬑.స్మి. అహందేహా⬑స్మి నేను దేహమును అనే భావము చేతనే ఈ నామస్మరణ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు. ఎంత కాలము నామస్మరణ చేసినప్పటికి దేహాత్మబుద్ధిని మనము ఉంచుకున్నప్పుడు ఇది ఏమాత్రము మార్పు చెందదు. అనేకమంది వారివారి సంస్కారములను సంప్రదాయములను పురస్కరించుకొని అనేక విధములైన రీతిగా సాధనలు సలుపుతుంటారు. ఎంతకాలము సాధన చేసినప్పటికిని వారిలో కొంతైన మార్పులు కనిపించవు. దీనికి తగిన ఫలము నందుకోలేకపోతున్నామే అనే నిరాశానిస్పృహలచేత వారు అనేక నామములు మార్చుకుంటుంటారు. నామములు మార్చుకోవటమే కాకుండా మతములు కూడను మార్చుకుంటారు. మతమును మార్చుకున్నంత మాత్రమున భగవిదమగ్రహము ప్రాప్తించదు. మతిని మార్చుకోవాలి. గుడ్డలు మార్చుకున్నంత మాత్రమున భగవంతుని గుణములు మనలో అలవడవు. గుణమును మార్చుకోవాలి. మనస్సును మార్చుకున్న వ్యక్తికి మాత్రమే మనుష్యత్వము ప్రాప్తిస్తుంది.
(శ్రీ స.వి.వా.పు.44)