అద్వైత వేదాంతమొక్కటే సరియైన వేదాంతమని అనేకులు భారత దేశమున భావింతురు. ఇది సరికాదు. మత సిద్దాంతముల నవగాహన పరచుకొన జూచువారి కందరకును ప్రస్థానత్రయములనబడు శ్రుతులు, బ్రహ్మసూత్రము, భగవద్గీత ఈ మూడును ముఖ్యమేఅను సత్యమును మరువరాదు. ఈశ్వరవాణిఅయినశ్రుతులు,ఉపనిషత్తులు,రెండవదైనబ్రహ్మసూత్రములు వ్యాసునిచేప్రతిపాదించబడినతత్త్వసిద్దాంతములన్నిటియొక్కపరమస్వరూపము. ఇది తత్త్వ వాజ్మయమునందు అత్యంత ప్రాముఖ్యము గలిగినది. ఆ అపూర్వ - సిద్ధాంతములు పరస్పర విరుద్ధములు కావు. అందు ప్రతిదీ పూర్వ సిద్ధాంతములపై ఆధారపడియున్నది. వ్యాస సూత్రములలో వాటికి పరిపూర్ణస్వరూపము సిద్ధించినది. నడుమ వేదాంతమునకు ఈశ్వర నిర్మిత వ్యాఖ్యానరూపమగు భగవద్గీత యిమిడియున్నది. ఆస్తిక మతములని చెప్పుకొను హైందవ మతములన్నియూ ద్వైతము కానీ, విశిష్టాద్వైతము కానీ,అద్వైతము కానీ,ఉపనిషత్తులను,వ్యాససూత్రములను,భగవద్గీతనూప్రమాణములుగా అంగీకరించుచున్నవి. వాటన్నిటికీ ప్రస్థానత్రయమే ఆధారము. నూతన సిద్ధాంతమును ఒకదానిని ప్రతిపాదింప సంకల్పించినవారందరునూ అనగా శంకర, రామానుజ, మధ్వాచార్య, వల్లభాచార్య, చైతన్య ఇత్యాది వారందరునూ ఈ ప్రస్థాన త్రయమునకు ఇంకొక భాష్యమును రచించవలసి వచ్చెను. కావున ఉపనిషత్తుల ఆధారముపై నిర్మింపబడిన ఒక్క సిద్ధాంతమునకు మాత్రమే వేదాంత శబ్దము వర్తించునని చెప్పుట కేవలము పొరబాటు. అన్నియూ వేదాంత మతములే. వేదాంత నామమును వహించుటకు అద్వైతి కెంత అధికారము కలదో అంత అధికారము విశిష్టాద్వైతికి కూడా కలదు. అంతేకాదు ద్వైతికి కూడా కలదు. ఇదియే పవిత్ర అపురూప అంతరార్థముతోకూడినది. యేకాత్మ భావన నిరూపించుది భారతీయ పరమార్ధ వాహిని.
ఆవు శరీరమునందు పాలున్నాయి. ఆ పాలలో నెయ్యి ఉన్నది. అయినా ఆ నెయ్యితో బలమురాదు. ఆ పాలను ఆవునుండి వేరుచేసి, అనగా పితికి కాచి, తోడు పెట్టి, పెరుగు అయిన తరువాత దానినే చిలికి వెన్న వేరుచేసి, దానినే తిరిగి కాచిన నెయ్యి కాగలదు. ఆ నెయ్యినే మళ్ళీ ఆవునకు త్రాపించిన ఆవుకు చక్కని బలము కలుగును. అలాగే సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అయినా, సాధనొపచారములు లేకుండా మానవులలో హితము చేయజాలడు. నువ్వులలో మానె. పెరుగులో వెన్న, భూమిలో నీరు. కట్టెలో నిప్పు కలసి వుండినటుల, సర్వాంతర్యామి మానవ శరీరములోను, మనసులోను కలిగియున్నాడు. అతనిని వేరు చేయాలంటే ప్రయత్నము, సాధన చేయాలి. అపుడు ఆ రెంటి అభేదత్వము ద్వైతంలో తెలుస్తుంది. అదే మోక్షము అని ఆది శంకరులవారు దీనినే అద్వైతోపాసన అని అన్నారు.
ఇక విశిష్టాద్వైతోపాసన : ఉపాసించతగిన పరమాత్మ తనకు వేరుగా ఉన్నట్లు భావించాలా? లేక తనతో కలిసి వుండినట్లు భావించాలా సాధకుడు? ఇదీ ప్రశ్న.
ఇక జవాబు : జీవుడు శరీరానికి ఆత్మ, అలాగే దేవుడు జీవునకు ఆత్మ. అలా భావించి ఉపాసించుటే రామానుజాచార్యుల విశిష్టాద్వైతోపాసన. ఈ సమస్త భూతజాలము ఎవనిలో ఉన్నాయో, యెవడు ఈ సమస్తానికి అంతర్యామిగా వ్యాపించియున్నాడో ఆ పరమపురుష పరమాత్మ అనన్యభక్తి (ప్రపత్తి)లోనే లభ్యమవుతాడు, అని పరజ్ఞాన ప్రపత్తి పూర్వకంగా పరమ పురుషోపాసన చేయుటయే విశిష్టాద్వైతము. “త్వమేవ సర్వం మమ దేవదేవా నీవే నా గతి, నీవే నా పతి, అనే అనన్య భావముతో ఉపాసించుట.
ద్వైతోపాసన, పతీ పత్ని సంబంధమే, జీవాత్మ పరమాత్మ సంబంధం కూడను. అవ్యయుడై విష్ణుభగవానుని తన పతిగా, భర్తగా భరించే వానిగా, తామ భరింపబడే వానిగా, ద్వైతభావముతో ఉపాసించుటయేయని మధ్వాచార్యులు ప్రబోధించిరి. భగవంతుని చరణాసక్తి లేనిదే జీవన్ముక్తి మాట అటుంచి, కనీసం బుద్ధిశుద్ధి కావటం కూడా అసంభవము అంటారు మధ్వాచార్యులు. మునులూ, ఆత్మారాములు అయిన వారికి లౌకిక గ్రంథాలు లేకపోయిననూ సూదంటురాయిలాంటి శ్రీహరి కల్యాణగుణముల విశేషంవల్ల భక్తి పారవశ్యం వారికి కలుగుతూ వస్తుందనియూ, ఆ పారవశ్యములో సిగ్గూ, బిడియములు వదలి శ్రీహరిలో ఐక్యతకు సంసిద్ధుడగు ననియూ, నృత్యము చేయుననియూ, బిగ్గరగా కీర్తనలు చేయుననియూ, అసలైన ఆనందాన్ని అనుభవిస్తాడనియూ, ఈ విశ్వాసాన్ని ఉపాసనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా పరానురక్తిలో ప్రధానత కలిగి ఉపాసనము జరుపుటే మధ్వాచార్యులవారి అభిమతమని వేనోళ్ళ చాటేరు. పతిని పొందు నిమిత్తమై సతీపతి పరితాపమే అద్వైతోపాసన అన్నారు.
భారతగీతోపాసన : భారతం పంచమ వేదము. అది ఐహిక, ఆముష్మిక ధర్మాల నిధి. మాధవుడు భారత ధర్మక్షేత్రరంగస్థలములో తన నాటక సామాగ్రి దింపుకొని ఆడిన అద్భుతమైన ఆట మహాభారతము. భారత నాటకానికి పాత్రధారులును, మాటలును, పాటలును, సమకూర్చినరచయిత, నటకుడు, దర్శకుడు, నిర్మాత, అంతా ఒక్క మాధవుడే, ఒక వైపున అధర్మవృద్ధమైన అపార భౌతిక బలం, మరొకప్రక్క ధర్మవృద్ధమైన పరిమిత ఆత్మబలము. ఈ రెంటి ఘర్షణలో పర్యవసానరూపమైన ధార్మిక విజయజ్యోతిగా తనను నిర్దేసించుట ఇదే భారతామృత సర్వస్వం. అదే భగవద్గీత. మహాభారత సారాంశమంతయూ భగవద్గీతలో వున్నది. “కరిష్యే వచనం తవ” నీవు చెప్పినట్లే చేస్తాను. "స్వధర్మే నిధనం శ్రేయః" ఇదే ఐహిక ధర్మానికి గీటురాయి. సర్వ శ్రేయస్సులను ప్రసాదించే నీ భక్తిని నిర్లక్ష్యము చేసిచేసి కళ్ళు మూసుకుని "అహం బ్రహ్మాస్మి" అనే అహంకారముతో బాధపడే నకిలీ బ్రహ్మలకు క్లేశమే ఫలితము. పొట్టు దంచితే బియ్యము రావు కదా? అసలు కృష్ణుని మాటను నమ్మక, బుద్ధికి తోచినట్లు పోవుట బ్రహ్మతత్వమునకు మార్గము కాదని. కృష్ణుడే సాక్షాత్ పరబ్రహ్మ అని, అనేక విధముల ఉపమాన, ఉపమేయాదులతో నిరూపించి,నిదర్శనమొసగి,ప్రబోధించినసర్వవేదాంతసారము భగవద్గీత. సమస్త శాస్త్రములలోనూమధించి, అందించిన సుధానిధి, భారతీయ పరమార్ధ వాహిని, దానినికాదనువారుందురా?ప్రకృతి,కాల,కర్మలుమూడునూఈశ్వరునిపరతంత్రములు,సత్యస్వరూపుడగుభగవంతుడు,అసత్యములనుదేనినీ కల్పింపజాలడు. కనుక ఒక విధంగా చూస్తే ప్రకృతి కూడా సత్యమనే చెప్పవచ్చును. ప్రళయావస్థయందు చేతన అచేతనములు ఈశ్వరునిలో లీనమైయుండును. కాలము ఆద్యంత రహితము అగు ఈశ్వరశక్తి. కర్మసహితము ప్రధాన సత్యమే.
(స.వా. పు. 72/76)