మనస్సు అడవి జంతువు వంటిది. అడవి జంతువులను యుక్తులచేత పట్టవలెను. తొందర పడకూడదు. బోను పెట్టవలెను. ఆ బోనులో ఎఱను పెట్టవలెను. ఎఱను చూచి మృగము బోనులో పడును. ఆ పడిన మృగమునకు కొన్ని రోజులు ఆహారము పెట్టకయుండవలెను. ఆంతట క్రమముగా ఆ మృగమును మచ్చిక చేసికొనవలెను. ఆహారము నీళ్ళు యిచ్చుచు బోనులోనే కొంతకాలము మచ్చిక చేసికొని పిమ్మట మెల్ల మెల్లగా బైటకి గొలుసుతో కట్టి విడిపించుచు, పూర్తి నిర్బంధము నుండి కొంతవరకు తప్పించి మచ్చిక జేసికొనుచు రాగా రాగా కడపట ఆ వన్య మృగము సాధువుగ మారి యజమానుడు చెప్పినట్లు నడుచుకొనును. ముఖ్యముగా ఏనుగుల విషయమునను, ఆ పిమ్మట పులి మొదలగు క్రూరమృగముల విషయమునను పై మచ్చిక చేయు విధానము చెల్లును. ఇట్లే మనస్సు కూడ అడవిజంతు వెట్లు ప్రారంభములో దగ్గఱ చేరనివ్వక, తొందర యిచ్చునో, అట్లే మనస్సును బలవంతముగా నిలుప చూసిన తిరుగబడి కష్ట పెట్టును. కాబట్టి అలంకరింపబడిన విగ్రహములనో, పటములనో,