అన్య భావనలేని భక్తి కలిగియుండుట. సంకట సమయమున వెంకట రమణుని తలంచి, సుఖము ప్రాప్తించగనే శ్రీనివాసుని చిత్తము నుండి తొలగించుట వంటిది కాదు. లేక నోరు చెడినప్పుడు రుచి కొరకై యేవైన పుల్లటి ఊరుగాయలు నంజుకొనినటుల అప్పటి కప్పుడు ఉపయోగ పెట్టు వ్యంజనమువంటిది కాదు. ఏమి వచ్చిననూ సర్వకాల సర్వావస్థలయందును భగవంతునితో విభక్తుడు కాని వాడుగా వుండవలెను. అట్టి అనన్య యోగమునే అన్య భావన లేని అనన్య భక్తి అని అందురు. ఏ పని చేసినా, యే మాట ఆడినా, యే పాట పాడినా భగవంతుని అనురక్తిని కలిగి నదే అనన్య భక్తి.
(గీ పు. 211/212)