"అన్నదానముకన్న నధిక దానంబేది?
తల్లిదండ్రులకన్న దైవమేది?
జపతపంబులకన్న సత్యశీలంబేది?
దయకంటె ఎక్కువ ధర్మమేది?
సుజనసంగతి కన్న చూడ లాభంబేది?
క్రోథంబుకన్న శత్రుత్వమేది?
ఋణముకంటెను నరులకు రోగమేది?
ధరణి నపకీర్తికంటెను మరణమేది?
సర్వదా కీర్తికంటెను సంపదేది?
స్మరణ కంటెను మించు ఆభరణమేది?”
(ఆ.రా. పు. 421)