నేను అప్పుడప్పుడు చెపుతుంటాను - భగవంతునితో చేరికయే ఆనందమని. ఎందుకంటే, భగవంతుడు ఆనంద స్వరూపుడు "నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.." ఇట్టి ఆనందమయుడైన భగవంతుణ్ణి దూరం చేసుకోవటం దురదృష్టం.
"చిక్కిన సాయిని వక్కచేయక చక్క చేసుకోండి
పోయిన చిక్కదు పర్తీ శ్వ రు ని పాదసేవయండి
శక్తిని ఇచ్చి శక్తిని పెంచి ముక్తి జేర్చు నం డి
ఇతరుల మాటల నింపుగ నమ్మి కొంప తీయకండి”
మీ అంతర్వాణిని మీరు నమ్మండి. అదియే ఆత్మసాక్షి. ఆత్మను నమ్మినవారికి ఎప్పుడూ ఏ కొరత కూడా ఉండదు. కనుక, ఆత్మ విశ్వాసాన్ని పెంచుకొని, దైవాన్ని ఆరాధన చేసి దివ్యత్వాన్ని పొందండి. జగత్తుకు ఆ ధర్మాన్ని అందించండి. అదియే చదువులోని నిజమైన సారము. “తరచి చదువు చదువ తర్కవాదమెగానీ పూర్ణ జ్ఞానం బెపుడు పొందలేడు" ఈనాడు చదువుకున్నవారు అనేకులు తర్కవాదంలో కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. అది అజ్ఞాన చిహ్నము. వాదనలో ప్రవేశించకండి. వాదన ఎనిమిటీ ని (వైరము) పెంచుతుంది. ఈనాడు మీకు కావలసినది యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ,
(స.సా. జూ 99 పు. 162)
విద్యార్థులారా! మనయందు అంతర్వాణి (Conscience) సో హంతత్వము క్షణక్షణమునకు బోధిస్తుంది. ఒక దినమునకు 24 గంటలు. ఇరవై నాలుగు గంటలలోపల యీ, సోహం తత్వము అనేది దినమునకు 21,600 సార్లు చెప్తుండాది. 21,600 సార్లు నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ, అని అంతర్వాణి నీకుపదేశము చేస్తూవుంటే ఈ వుపదేశమును ఒక ప్రక్క కట్టి పెట్టి నేనే బ్రహ్మ అనేది మరచిపోయావు.
సొోహం అనేది పుట్టిన పేరు. పుట్టిన పేరు శాశ్వతముగాని పెట్టిన పేరు శాశ్వతమా? పెట్టిన పేరు కృత్రిమము (ఆర్టిఫిషియల్). పుట్టినది రియల్. అదే సత్యం. ఆ సత్యమునే ఋతముగా భావించుకోవాలి. ఈ సత్య ఋతములను రెండింటిని యేకము గావించుకొని, దివ్యత్వమైన సచ్చిదానందమునుపొందాలి, కనుకబుద్దిఅనేదిలోకరీత్యాఉచ్చరించేదిగానీ,అనుభవించేదిగానీ,ఉపయోగించేది గానీ కాదు. బుద్దియొక్క రహస్యాన్ని చక్కగా గుర్తుంచుకొని యీరథసారధి తర్క విషయాన్ని తద్వారా పూర్తిగా తెలుసుకొన్నప్పుడే మన జీవిత రథాన్ని అతనికి అర్పితము చేయటానికి అవకాశముంటుండాది.
(బృత్రపు ౧౦౨/౧౦౩)
ఆత్మ సర్వులయందు ఎట్లు వుంటున్నది? జ్ఞానమనేది సర్వులయందు ఏవిధముగా ఉంటున్నది? అనిఏకాంతముగా కూర్చుని విచారణ చేసినప్పుడు శాశ్వతమైన, సత్యమైన, మార్పుచెందని శబ్దము మననుండి ఆవిర్భవిస్తుండాది. జగత్తునందున్న సమస్త పదార్థములు మార్పు చెందుతున్నాయి. సమస్త ఆకారములు మార్పు చెందుతున్నాయి. ప్రతి పదార్థము అణుమాత్రమే. ఈ అణువులు చేరికనే పదార్థ స్వరూపము. కాలక్రమేణా యీ అణువులు వేరైపోతుంటాయి. అణువుల స్వభావము, సంయోగ వియోగముల తత్త్యమే. కానీ మార్పు చెందని కూర్పు కలుగని ఒక దివ్యవాణి సర్వులయందు ఒక్కటిగానే వుంటున్నది. బాల్యము నoదు , యౌవనము నందు , వార్ధక్యము నందు, దేహము మార్పు చెందుతున్నది కాని ఆ వాణి మార్పు చెందటం లేదు. జాగ్రత్ స్వప్న, సుషుప్తులు మూడు అవస్థలు. మనము అనుభవిస్తున్నామే కాని యీ వాణి మార్పు చెందటం లేదు. స్థూలసూక్ష్మ కారణములు మనము అనుభవిస్తున్నామే గాని యీవాణి మార్పు చెందటం లేదు. ఏమిటి ఆవాణి? ఆత్మతత్వము నుండి వెలువడిన దివ్యమైన అంతర్వాణి. అదియే నేమ, నేను, నేను. అహం, అహం, అహమ్. ఇదే సత్యమైనది. ఈ సత్యము అణువుకంటె చాల సూక్ష్మమైనది Truth is more fundamental than atom. ఇలాంటి సత్యస్వరూపమైనది అహం అహం అహం. ఈ అహం చేత స్ఫురింపబడిన ఈ తత్వమే
సోహం. ఈ అహం దేహముతో తాదాత్మ్యము పొందినప్పుడు అహంకారముగా మారుతున్నది. అహంకారము ప్రాకృతమైన భావము, అహం దివ్యమైన వాణి, దీనిని పాండిత్యము చేతగాని ధీశక్తిచేగాని గుర్తించటము అసాధ్యము.
(బృత్ర.పు ౧౩౪)
బుద్ధికి అంతర్వాణి అని మరొక పేరు. ఆఅంతర్వాణిని పురస్కరించుకొనియే మానవుడు తన జీవిత మార్గమును అనుసరిస్తుంటాడు. సమస్యలు చెలరేగినప్పుడు అoతర్వాణి జవాబులకు కాచుకొని వుంటాడు. తన అoతర్వాణి సంతృప్తిగా లేకుండిన సంతృప్తి ని ప్ర క టించ లేడు. అoతర్వాణి సంతృప్తిగా నుండిన భా హ్య జగత్తు నందునుసంతృప్తి ప్ర క టి స్తాడు. నిత్య జీ వి త ము లోనా కానిషియస్*నాకుతృప్తిగాలేదు,నాకానిషియస్*దీనిని వొప్పుకోవటంలేదు అంటారు.ఇక్కడ Conscience అనగాFollowthemasterఅన్నారు.Masterఎవడు?అంతర్వాణియేనీConscienceయేనీMaster.ఈకానిషియస్అంతర్వాణినిఅనుసరించినమనముసరియైనస్థాయిని చేరుకోగలము.
(బృత్రపు -౯3)
(చూ ఐకమత్యం, దివ్యత్వం, పవిత్రత)