అంగీరసుడు

భగవంతుడు మానవదేహంలో ప్రతి ణువునందుప్రతి అంగమునందు రసస్వరూడై నివసిస్తూ క్షణ క్షణమూ మానవుణ్ణి కాపాడుతూపోషిస్తూ వస్తున్నాడుకనుకనే భగవంతుణ్ణి  అంగీరసుడు  అన్నారు. భగవంతుని నుండి ఇట్టి రక్షణ పొందడంచేత మానవుడు భగవంతునికి ఋణపడి యుంటున్నాడు. ఈ ఋణమును తీర్చుకోవాలంటే మానవుడు తన శక్తికొలది సత్కర్మల నాచరించాలి. తోటి మానవునికి తోడ్పడాలిసమాజ సేవలో పాల్గొనాలి. అయితే. సేవ చేయడం పరులకు సహాయపడటం కోసమని భావించకూడదుతన ఋణవిముక్తి కోసమే అని గుర్తించాలి. ఏ సేవ చేసినప్పటికీ దైవఋణం కొంతవరకు తగ్గిపోతుంది. సేవకుడే నిజమైన నాయకుడు. భగవంతుడు దేహము నిచ్చినది సేవ చేయడానికే అని గుర్తించి సేవలో పాల్గొని దైవ ఋణమును తీర్చుకొని మానవుడు ధన్యుడు కావాలి. (స. సా మే 2000 పు. 141/142)



About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage