భగవంతుని ప్రేరణలో కలిగిన మానసిక బలము నిన్ను పై అంతస్థులకు తీసికొనిపోవును. దీనినే సంకల్ప బలమందురు. దీనిని జప, ధ్యానములతో అభివృద్ధి చేసికో, బుద్ధి యొక్క అధికారమునకు మనస్సు లోబడునట్లు చూడు. లేని యెడల మనస్సు ఇష్టము వచ్చినట్టు పరుగిడును. మనస్సు చాల చంచలమైనది. అందువలననే నేను Watch" (భద్రము) అని చెప్పుచుందును. ఆ శబ్దములోని మొదటి అక్షరము ‘W’ ని మాటలు (Words) A ఆచరణలు (Actions). "T భావనలు (Thoughts), (C) నడత లేక శీలము (Character) H హృదయము (Heart) విషయములలో జాగరూకుడవుగా నుండవలెనని అర్థము. ఈ ఐదు విషయములలోను తీసుకోవలసిన జాగ్రత్త గురించి ("Watch) అడుగడుగునా జ్ఞాపకము చేసిన, నీవు చాల ఆనందముగా నుండగలవు.
ఇంద్రియములు నీ మానసిక శక్తులకు, భ్రాంతులకు మూలములు.
(శ్రీస.సూ.పు,99/100)