రుక్మిణీ కల్యాణము ప్రకృతీ పురుషుల కలయికను తెల్పు తత్త్వబోధ. ఆ - కల్యాణము బ్రాహ్మణ మధ్యవర్తిత్వము, వివాహ విధివిధాయకమైన వేద - ప్రా మాణ్యమునకు చిహ్నము. వధూవరుల యెకీభావము వేదమంత్రముల మూలముననే దృఢపడును. రుక్మిణి జీవుడు, కృష్ణుడు పరమాత్మ. జీవబ్రహ్మైక్యమే, రుక్మిణీకృష్ణ సంయోగము. రుక్మిణి సదాచారశీల, సనాతన ధర్మపరాయణ. ఆమె కృష్ణుని ప్రేమించి, ఆయనను వివాహమాడ నిశ్చయించుకొన్నది. అందుకామె అన్నయు, తండ్రి యు వ్యతిరేకులైనారు. కారణమేమనగా అన్న అహంకారి, కృష్ణద్వేషి. తండ్రి - అనాత్మజుడు , లౌకిక లాలసుడు. అందువలన ఆమె వారిననుసరింప నిష్టములేక, స్వతంత్రింప శక్తిలేక మనసున బాధపడి, కృష్ణా! నాకు నీవు తప్ప వేరే శరణము - నన్ను నీ పాదదాసిని చేసికొను భారము నీదే నని నిశ్చలమైన భక్తితో, నిరంతరము కృష్ణుని ప్రార్థించుచూ, ధ్యానించుచూ కాలము గడుపుచున్నది. ఆమె ప్రార్థన, పరితాపము కృష్ణుని మన్నన లందుకొన్నవి. ఆమె ప్రాచీన సాంప్రదాయానుష్ఠానమే - యామె అభీష్టసిథ్థికి తోడ్పడినది. ఎట్లనగా, వివాహ ప్రక్రియకు ముందామె గౌరిని పూజించుటకు దేవాలయమునకు వెళ్ళినది. అది ప్రాచీన సాంప్రదాయము. - పూజానంతరము , రుక్మిణి ఆలయమునుండి వెలుపలకు రాగానే ఆమె రాకకు యెదురుచూచుచు అక్కడనే వేచియున్న కృష్ణుడామెకు చేయూతనిచ్చి, రథముపై - గూర్చుండపెట్టుకొని వెళ్ళిపోయినాడు. ఆమె అన్నయు, తండ్రి, బంధువులు కృష్ణు నెదింరింప యత్నించిరిగాని లాభములేకపోయినది. రుక్మిణి బంధువర్గమును పరిత్యజించి తన మనోనాథునితో గూడి తరలిపోయినది. వివాహమునకు ముందామె కృష్ణునెన్నడును చూడలేదు. "వూయింగు ఆ కాలమున లేదు. అది భారతీయ సంప్రదాయము కాదు ుక్మిణి యాత్మ కృష్ణునికొరకుత్కంఠతో తపించినది. కృతార్ధమైనది.ముందు జరిగినది వారి ఆత్మల కలయిక. తరువాత దేహముల కలయిక .కాబట్టి,వారిది లోక సాధారణమైన వివాహము కాదు. సాహస కృత్యము కానేకాదు. (దివ్య జ్ఞాన దీపికలు ద్వితీయ భాగం పు 25)